Publish Date - 11:32 am, Mon, 17 February 20
By
veegamteamఅమ్మాయి..అబ్బాయికి వివాహం చేసే ముందు నిశ్చితార్థం (ఎంగేజ్ మెంట్ )చేసుకోవటం ఆనవాయితీ. కానీ ఓ నిశ్చితార్థం జరిగిన పద్ధతి చూస్తే మాత్రం పిచ్చి పీక్స్ అయిపోయింది అని అనుకోక తప్పదు. అటువంటి నిశ్చితార్థం కాదు కాదు పిచ్చితార్థం ఎలా జరిగిందో చూడండీ..
మా ఇంట్లో నిశ్చితార్థం ఉంది మీరంతా తప్పకుండా రండి అని పిలిస్తే బంధుమిత్రులంతా వెళ్లారు. నిశ్చితార్థం ముహూర్తం దగ్గరపడింది. అమ్మాయి, అబ్బాయి కూర్చోవటానికి పీటలు కూడా వేశారు. అమ్మాయి అబ్బాయి వస్తారని బంధువులంతా ఎదురుచూస్తున్నారు. అక్కడ వేసి ఉంచిన రెండు పీటల మీదా రెండు మొబైల్ ఫోన్లు పెట్టారు. ఇదేంటీ..అంటూ వచ్చినవారంతా వింతగా చూస్తున్నారు. కానీ ఆతృత ఆపుకోలేని ఓ గెస్ట్ ‘‘అమ్మాయి, అబ్బాయి ఏరీ అంటూ అడిగారు. ‘‘ఇదిగో వీరే అమ్మాయి..అబ్బాయి’’ అంటూ మొబైల్ ఫోన్లలలో సదరు నిశ్చితార్థం జరిగే జంటల ఫోటోలను పెట్టారు.
‘‘అదేంటండీ.. అమ్మాయి, అబ్బాయి కూర్చోవల్సిన ప్లేసులో ఇలా మొబైళ్లు పెడుతున్నారేంటీ’ అని అడిగాడు. దానికి వారు చెప్పిన సమాధానం విని దిమ్మతిరిగిపోయింది. ‘‘నిశ్చితార్ధానికి రావటానికి ఇద్దరికీ టైమ్ సరిపోలేదండి. అందుకే, ఫోన్లో వీడియో కాల్ లోనే నిశ్చితార్థం కానిచ్చేస్తున్నాం’’ అని చెప్పేసరికి గెస్ట్ అంతా నోరెళ్లబెట్టారు. ఇదేదో జోక్ కానే కాదు..అభూత కల్పన అసలే కాదు. సాక్షాత్తు మన డిజిటల్ ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో జరిగింది.
యువతి వీడియో కాల్‌లో ఉన్న ఫోన్‌ను ఆమె తల్లిదండ్రులు చీరతో అలంకరించారు. అనంతరం సాంప్రదాయబద్దంగా పూజలు నిర్వహించి ఇద్దరికీ నిశ్చితార్ధం జరిపించారు. రాహుల్ నిన్గోట్ అనే వ్యక్తి ఇటీవల ఈ వీడియోను ట్విట్టర్‌లో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది.
Hey, Team #MetroPark look what you have done? ?@RanvirShorey @AbiVarghese @purbijoshi @ajayanvenu@OmiOneKenobe @vegatamotia @ErosNow. @anandmahindra here’s what I found in my #Whatsappwonderbox. ? pic.twitter.com/bAKbpThnzH
— RΛHUL NINGOT (@RahulNingot) February 12, 2020
11 days baby corona : పుట్టిన ఐదు రోజులకే కరోనా..11రోజుల పసిబిడ్డకు ప్లాజ్మా చికిత్స
Goat Gave Birth : మనిషి ముఖంతో వింత జీవికి జన్మనిచ్చిన మేక
Gujarat : చెత్త లారీలో వెంటిలేటర్ల తరలింపు
Rich Dogs : ఆ గ్రామంలో కుక్క పుడితే చాలు…కరోడ్ పతి అయిపోవచ్చు..
Allu Arjun : మాల్దీవుల్లో బన్నీ ఫ్యామిలీ, ఫొటోలు వైరల్
gold nose pin : కరోనా వ్యాక్సిన్ వేసుకుంటే..ముక్కు పుల్ల ఫ్రీ