Hardik Patel: కాంగ్రెస్‌కు షాకిచ్చిన హార్దిక్ పటేల్.. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడి

మరికొద్ది నెలల్లో గుజరాత్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. గుజరాత్ లో ఈ దఫా సత్తాచాటేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక రూపొందిస్తోంది. ఈ క్రమంలో ఆదిలోనే ఎదురు దెబ్బ అన్నట్లుగా...

Hardik Patel: కాంగ్రెస్‌కు షాకిచ్చిన హార్దిక్ పటేల్.. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడి

Hardik Patel

Hardik Patel: మరికొద్ది నెలల్లో గుజరాత్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. గుజరాత్ లో ఈ దఫా సత్తాచాటేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక రూపొందిస్తోంది. ఈ క్రమంలో ఆదిలోనే ఎదురు దెబ్బ అన్నట్లుగా ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, పటీదర్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ట్విటర్ వేదికగా ప్రకటించారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను షేర్ చేశారు.

ఈ సందర్భంగా ఆయన ట్విటర్ లో .. కాంగ్రెస్ పార్టీకి, పదవికి రాజీనామా చేస్తున్నాను, నా నిర్ణయాన్ని నా సహచరులు గుజరాత్ ప్రజలు స్వాగతిస్తారని నమ్ముతున్నాను అంటూ హార్దిక్ పేట్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు రావడం ద్వారానే భవిష్యత్తులో గుజరాత్ కోసం సానుకూలంగా పనిచేయగలనని విశ్వసిస్తున్నానంటూ ట్విటర్ లో హార్దిక్ రాసుకొచ్చారు. హార్దిక్ పటేల్‌ బీజేపీ లేదా ఆమ్‌ ఆద్మీ పార్టీలో చేరతారనే ప్రచారం సాగుతోంది. ఈ విషయమై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Hardik Patel: కాంగ్రెస్‌కు హార్ధిక్ పటేల్ ఝలక్

హార్దిక్ పటేల్ కు కాంగ్రెస్ లో సరియైన గౌరవం దక్కడం లేదని ఆయన వర్గీయులు పేర్కొంటున్నారు. 2019లో కాంగ్రెస్‌లో చేరిన హార్దిక్‌ను పార్టీ నాయకత్వం నిర్లక్ష్యం చేస్తోందని, పట్టించుకోలేదని, పీసీసీ సమావేశాలకు కూడా హార్దిక్ ను ఆహ్వానించడం లేదని ఆయన వర్గీయులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో హార్దిక్ కాంగ్రెస్ ను వీడుతారని ప్రచారం జరిగింది. అయితే ఆయన ప్రచారాన్ని ఖండించారు. కాంగ్రెస్ ను వీడే ప్రసక్తే లేదని చెప్పారు. ఇలా చెప్పిన కొద్దిరోజులకే హార్దిక పటేల్ కాంగ్రెస్ కు రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది.