Ramdev: రామ్‌దేవ్‌ను కొవిడ్ వారియర్స్‌పై కామెంట్లు వెనక్కు తీసుకోమన్న హర్ష్ వర్ధన్

కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష్ వర్ధన్ కొవిడ్ వారియర్స్ పై చేసిన కామెంట్లు వెనక్కు తీసుకోవాలని సూచించారు. అల్లోపతి మెడిసిన్ వాడి లక్షల మంది చనిపోయారంటూ ...

Ramdev: రామ్‌దేవ్‌ను కొవిడ్ వారియర్స్‌పై కామెంట్లు వెనక్కు తీసుకోమన్న హర్ష్ వర్ధన్

Ramdev

Ramdev: కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష్ వర్ధన్ కొవిడ్ వారియర్స్ పై చేసిన కామెంట్లు వెనక్కు తీసుకోవాలని సూచించారు. అల్లోపతి మెడిసిన్ వాడి లక్షల మంది చనిపోయారంటూ చేసిన కామెంట్లను ఖండించారు.

యోగా గురు రామ్ దేవ్ కు లెటర్ ద్వారా తన అభ్యంతరకర స్టేట్మెంట్ వెనక్కుతీసుకోవాలని అడిగాం. ఈ స్టేట్మెంట్ కొవిడ్ వారియర్స్ ను అవమానించడమే కాక వాళ్ల సెంటిమెంట్ ను కించపరిచినట్లేనని వర్ధన్ అన్నారు.

ఓ వీడియోలో మొబైల్ చూస్తూ.. అల్లోపతి అనేది ఓ స్టుపిడ్ మెడిసిన్. ముందు క్లోరోక్విన్ ఫెయిల్ అయింది. ఇప్పుడు రెమెడెసివర్. తర్వాత యాంటీ బయాటక్స్ ఫెయిల్ అయింది. స్టెరాయిడ్ ఫెయిల్ అయ్యాక ప్లాస్మా థెరఫీ కూడా బ్యాన్ చేశారు’ అని ఉంది.

ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖను రామ్ దేవ్ పై యాక్షన్ తీసుకోవాలని సూచించింది.