హర్యానా సీఎం ఖట్టర్ కు కరోనా

  • Published By: venkaiahnaidu ,Published On : August 24, 2020 / 09:17 PM IST
హర్యానా సీఎం ఖట్టర్ కు కరోనా

హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కు కరోనా పాజిటివ్ అని తేలింది. తనకు పాజిటివ్ గా తేలిందన్న విషయాన్ని ఆయన ట్వీట్ ద్వారా తెలిపారు. “ఈ రోజు కరోనా నిర్ధారిత పరీక్షలు చేయించాను. రిపోర్ట్ పాజిటివ్ గా వచ్చింది. నన్ను సంప్రదించిన వారందరూ సెల్ఫ్ క్వారంటైన్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను” అని ట్విట్టర్లో ఖట్టర్ తెలిపారు.

మరోవైపు,దేశంలో కరోనా రోగుల సంఖ్య 31,24,391 కు పెరిగింది. వీరిలో 23,52,507 మంది నయమవగా, 57,869 మంది మరణించారు. ప్రస్తుతం 7,13,461 మంది రోగులు చికిత్స పొందుతున్నారు.

కాగా,దేశంలో కరోనా వ్యాక్సిన్ కోసం మిషన్ కొవిడ్ భద్రతా పథకాన్ని ప్రవేశపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. బయోటెక్నాలజీ విభాగం తన ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపినట్లు తెలిసింది. ఈ మిషన్ యొక్క లక్ష్యం దేశంలో కనీసం 6 కరోనా వ్యాక్సిన్లను తయారు చేసి లైసెన్స్ ఇవ్వడం, అలాగే వాటిని మార్కెట్లో ప్రవేశపెట్టడం. అయితే, ఇది ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు.