వర్షంలా కురిసిన సాయం: రూ.500 కోసం 30కిలోమీటర్లు నడిచిన మహిళ

  • Published By: Subhan ,Published On : May 5, 2020 / 10:04 AM IST
వర్షంలా కురిసిన సాయం: రూ.500 కోసం 30కిలోమీటర్లు నడిచిన మహిళ

రాధా దేవీ అనే 50ఏళ్ల మహిళ వెన్నునొప్పితో బాధపడుతూ రూ.500 కోసం 30కిలోమీటర్ల దూరం నడిచింది. ఫిరోజాబాద్ కు వెళ్లిన ఆమె ఖాళీ చేతులతో తిరిగి రావాల్సి వచ్చింది. కారణం ఆ మహిళ జన్ ధన్ అకౌంట్లో డబ్బులు పడ్డాయేమోనని చెక్ చేసుకోవడానికి బ్యాంకుకు వెళ్లింది. ఆమె పేరిట జన్ ధన్ అకౌంట్ తెరిచిలేదని బ్యాంకు వారు చెప్పారు. అయినప్పటికీ మొనెటరీ సహకారంతో SBI సేవింగ్స్ అకౌంట్లోకి డబ్బులు వచ్చిపడ్డాయి. 

ఆమె బ్యాంకు బ్యాలెన్స్ ఇప్పుడు రూ.207నుంచి రూ.26వేలకు పెరిగింది. అదెలాగో SBI పచోఖరా బ్రాంచ్ మేనేజర్ లక్ష్మణ్ సింగ్ చెబుతున్నారు. ’29మంది ఆమెకు వ్యక్తిగతంగా సాయం చేసేందుకు ముందుకొచ్చారు. ఆమె కథ విన్న తర్వాత కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ పర్సనల్ అసిస్టెంట్ జీఏ పృథ్వీ కూడా ఆమెకు సాయం అందించేందుకు ముందుకొచ్చారు. 
 
ప్రత్యేక శ్రద్ధ తీసుకుని రాధా దేవీకి జన్ ధన్ అకౌంట్ ఇప్పించే ప్రయత్నం చేస్తానన్నారు. అలా చేస్తే నేరుగా ఆమె అకౌంట్లోకే డబ్బులు డిపాజిట్ అవుతాయని అంతేగాక వెన్ను సమస్యకు కూడా ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ స్కీం కింద ట్రీట్‌మెంట్ చేయిస్తామని మాట ఇచ్చారు. 

ఈ ఘటనతో రాధాదేవీ నా సంతోషం మాటల్లో చెప్పలేనని, కలలో కూడా అనుకోలేదని అంత ప్రేమను తనపై చూపించారని అన్నారు. లాక్ డౌన్ పీరియడ్లో నా కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ డబ్బులు సరిపోతాయనుకుంటున్నా అని చెప్పింది. లాక్ డౌన్ సమయంలో 15ఏళ్ల కొడుకుతో కలిసి వెళ్లి జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఉందని చెప్పాను. డబ్బులు పడేది జీరో బ్యాలెన్స్ అకౌంట్ కు కాదని.. జన్ ధన్ అకౌంట్ కు వస్తాయని చెప్పారు. 

Also Read | లాక్ డౌన్ 3.0 : 1200 కిలోమీటర్లు సైకిల్ పై ప్రయాణం..చివరకు మృత్యులోకాల్లోకి