Wedding card: ట్యాబ్లెట్ షీట్ కాదు.. పెండ్లి పత్రిక.. నెటిజన్లను ఆకర్షిస్తున్న వెడ్డింగ్ కార్డ్

చూడ్డానికి ట్యాబ్లెట్ షీట్‪‌లాగా కనిపిస్తున్నప్పటికీ అది వెడ్డింగ్ కార్డు. వచ్చే నెలలో పెళ్లి చేసుకోబోతున్న ఒక జంట ఇలా వినూత్నంగా తమ పెండ్లి పత్రిక డిజైన్ చేయించుకుంది. ప్రస్తుతం ఈ ట్యాబ్లెట్ షీట్‌లాంటి వెడ్డింగ్ కార్డు నెటిజన్లను ఆకర్షిస్తోంది.

Wedding card: ట్యాబ్లెట్ షీట్ కాదు.. పెండ్లి పత్రిక.. నెటిజన్లను ఆకర్షిస్తున్న వెడ్డింగ్ కార్డ్

Wedding card: సంప్రదాయా పెండ్లి పత్రికలకు భిన్నంగా అప్పుడప్పుడూ కొందరు వినూత్నంగా వెడ్డింగ్ కార్డ్స్ డిజైన్ చేయిస్తుంటారు. అలాంటి వాటిలో కొన్ని నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటాయి. తాజాగా ఒక వెడ్డింగ్ కార్డ్ కూడా అలాగే ఆకట్టుకుంటోంది. ప్రముఖ వ్యాపారవేత్త, ఆర్‌పీజీ గ్రూప్ ఛైర్మన్ హర్ష్ గోయెంకా షేర్ చేసిన వెడ్డింగ్ కార్డ్ అది.

Income tax: నగదు లావాదేవీలపై ఆదాయపు పన్ను శాఖ కన్ను.. 20 వేలు దాటితే నిషేధం

చూడ్డానికి ట్యాబ్లెట్ షీట్‌లా కనిపిస్తున్న ఒక వెడ్డింగ్ కార్డును హర్ష్ గోయెంకా తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ట్యాబ్లెట్ షీట్ వెనుకవైపు ఎలా ఉంటుందో ఆ పెండ్లి పత్రిక కూడా అలాగే ఉంది. ఒక ఫార్మసీ కాలేజీలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న ఇళరసన్ అనే వ్యక్తి, నర్సింగ్ కాలేజీలో పనిచేస్తున్న వసంత కుమారిని వివాహం చేసుకోబోతున్నాడు. ఇద్దరిదీ మెడికల్ ఫీల్డే కావడంతో తమ పెండ్లి పత్రికను వినూత్నంగా డిజైన్ చేయించుకున్నారు. ట్యాబ్లెట్ షీట్‌లాగా ఉన్న ఈ వెడ్డింగ్ కార్డుపై ట్యాబ్లెట్లపై వాడే పదజాలాన్ని ఉపయోగించి దీన్ని తయారు చేశారు. వధూవరుల పేర్లు, మ్యానుఫాక్చరర్స్, వెన్యూ వంటివి అన్నీ ట్యాబ్లెట్ షీట్‌లాగే ముద్రించారు.

Loan Apps: లోన్ యాప్స్ ఉపయోగించి రూ.500 కోట్ల దోపిడీ.. చైనాకు తరలిస్తున్న ముఠా

అలాగే వార్నింగ్ స్థానంలో.. ఫ్రెండ్స్, రిలేటివ్స్ తప్పకుండా హాజరుకావాలని కోరారు. దూరం నుంచి చూస్తే అది వెడ్డింగ్ కార్డ్ అంటే ఎవరూ నమ్మరు. అంత పర్ఫెక్ట్‌గా, ట్యాబ్లెట్ షీట్‌లాగా దీన్ని రూపొందించారు. ప్రస్తుతం ఈ వెడ్డింగ్ కార్డు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొందరు నెటిజన్లు అలాంటి క్రియెటివ్ వెడ్డింగ్ కార్డుల గురించి కూడా పోస్ట్ చేస్తున్నారు.