Mansukh Mandaviya : అరచేతిలో వ్యాక్సిన్ సమాచారం..కేంద్రఆరోగ్యశాఖ

కరోనా వ్యాక్సిన్ కేంద్రాల వద్ద ప్రతిరోజూ తొక్కిసలాటలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో విస్తృత సాంకేతికత ద్వారా దగ్గర్లోని వ్యాక్సిన్ కేంద్రాల సమాచారంతో పాటు ఇతర సేవలను అందించేందుకు

Mansukh Mandaviya : అరచేతిలో వ్యాక్సిన్ సమాచారం..కేంద్రఆరోగ్యశాఖ

Phone

కరోనా వ్యాక్సిన్ కేంద్రాల వద్ద ప్రతిరోజూ తొక్కిసలాటలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో విస్తృత సాంకేతికత ద్వారా దగ్గర్లోని వ్యాక్సిన్ కేంద్రాల సమాచారంతో పాటు ఇతర సేవలను అందించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ కీలక చర్యలు చేపట్టింది. కోవిడ్ -19 వ్యాక్సిన్‌ లభ్యత సమాచారాన్ని ప్రజలకు మరింత సలువుగా అందించేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గూగుల్‌తో భాగస్వామ్యం కలిగి ఉందని బుధవారం కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రి మన్సుఖ్ మాండవియా ట్విట్టర్ ద్వారా తెలిపారు.

పౌరులు..గూగుల్​లో ‘కొవిడ్ వ్యాక్సిన్ నియర్ మీ’ అని సెర్చ్ చేసి వ్యాక్సిన్ సమాచారాన్ని తెలుసుకోవచ్చని… స్లాట్‌ల లభ్యత, పేరు నమోదు కోసం ‘బుక్ అపాయింట్‌మెంట్’ ఫీచర్‌ ను ఉపయోగించుకోవాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి ట్వీట్ లో తెలిపారు. గూగుల్ ఇండియా బ్లాగ్ యొక్క లింక్‌ను కూడా ట్విట్టర్ లో షేర్ చేశారు.

మరోవైపు,దేశంలో కోవిడ్ సంబంధిత అత్యవసర మెడిసన్ల సరఫరా, అందుబాటుపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్షుక్ మాండవీయ బుధవారం సమీక్షించారు. ఈ సమీక్షా సమావేశంలో ఆరోగ్య శాఖ సీనియర్ అధికారులు పాల్గొన్నారు. అత్యవసర మందులు, వాటికి అవసరమైన ముడి సామగ్రి నిల్వలు తగినంత మొత్తంలో అందుబాటులో ఉన్నట్టు ఈ సమీక్షలో నిర్ధారించారని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 8 డ్రగ్స్‌కు సంబంధించి ఈ బఫర్ స్టాక్స్ దేశంలో అందుబాటులో ఉన్నాయి. వీటిలో రెమ్‌డెసివిర్, ఎనాక్సోఫిరిన్ వంటివి ఉన్నాయి.