Hidimba mata Festival : భీముడి భార్య..హిడింబి మాతా ఆలయంలో ఆగిపోయిన వేడుకలు దూంగ్రీ మేళా

Hidimba mata Festival : భీముడి భార్య..హిడింబి మాతా ఆలయంలో ఆగిపోయిన వేడుకలు దూంగ్రీ మేళా

Hidimba Mata Temple doongri Mela festival

Hidimba mata temple Doongri Mela Festival :  అన్ని దేవాలయాల్లో భక్తుల సందడి కనిపించటంలేదు. కారణం కరోనా. వేడుకలు భక్తులు లేకుండానే జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈ కరోనా దెబ్బ పంచపాండుల్లో రెండవవాడు అతి బలాఢ్యుడు అయిన భీమసేనుడు భార్య..హిండింబి దేవాలయంలో ప్రతీ ఏటా బ్రహ్మాండంగా జరిగే దూండ్రీ మేళాకు కూడా సోకింది. హిమాచల్‌ప్రదేశ్‌లో కొలువైన హిడింబి మాతా దేవాలయంలో ఈరోజుల్లో దూంగ్రీ మేళా కన్నుల పండువలా జరిగేది. కానీ కరోనా తెచ్చిన లాక్‌డౌన్‌ వల్ల ఈ ఏడాది ఈ దూండ్రీ మేళా వేడుకలు నిలిచిపోయాయి.

ఈరోజుల్లో మండుటెండలో మనాలిలోని హిడంబామాత ఆలయంలో పెద్ద ఉత్సవం జరిగేది.. ఈ ఏడాది లాక్ డౌన్ వల్ల ఈ ఉత్సవం ఆగిపోయింది. హిడింబి. భీమసేనుడి భార్య. ఘటోత్కచుడి తల్లి. మాయాబజార్‌ సినిమా చూస్తే హిడింబి ఎంత సౌమ్యురాలో, ఎంత ఉత్తమురాలో అర్థమవుతుంది. హిమాచల్‌ప్రదేశ్‌లోని మనాలి ప్రాంతవాసులు హిడింబిని దైవంగా భావిస్తారు. అమ్మగా కొలుస్తారు. హిడంబామాతగా భక్తిప్రపత్తులతో కొలుచుకుంటారు. హిడింబి మాత జన్మదిన వేడుకలను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా మూడు రోజుల పాటు దూంగ్రీమేళాను నిర్వహిస్తారు. కరోనా లేకపోయి ఉంటే 14,15, 16 తేదీల్లో ఉత్సవాలు జోరుగా జరిగేవి.

హిడింబి రాక్షస జాతికి చెందిన స్త్రీ. కానీ చాలా సౌమ్యురాలు,ఉత్తమురాలు. అందుకే ఆమె అక్కడ పూజలందుకుంటోంది. మనుషులుగా పుట్టి రాక్షసుల్లా ప్రవర్తించేవాళ్లు ఉన్నారు. కానీ హిడింబి రాక్షసజాతిలో పుట్టినా ఉత్తమురాలు. అందుకే ఆమె పూజలందుకుంటోంది. హిమాచల్‌ప్రదేశ్‌లోని మనాలిలో భీమసేనుడి భార్య హిడింబి కూడా పూజలందుకుంటోంది. హిడింబాదేవిగా స్థానికులు భక్తితో కొలుచుకునే హిడింబికి ఓ అద్భుతమైన ఆలయం కూడా ఉంది.

హిడింబి మాతకు వసంతరుతువు చివరలో వేడుక చేస్తారు. హిడంబామాత మీద తమకున్న భక్తి ప్రపత్తులను స్థానికులు చాటుకునే ఉత్సవం దూండ్రీ మేళా ఉత్సవం. ప్రతి ఏడాది మే 14 నుంచి 16 వరకు జరిగే ఉత్సవాన్ని దూంగ్రీ మేళ అంటారు. మూడు రోజుల పాటు వైభవంగా కన్నుల పండుగగా ఈ మేళ జరుగుతుంది.

మహాభారతంలో హిడింబికి విశిష్టపాత్ర ఉంది. హిడింబాసురుడనే రాక్షసుడికి హిడింబి చెల్లెలు. పాండవుల్లో రెండోవాడైన భీమసేనుడికి ద్రౌపతి కాకుండా ఆమెకూడా భార్య. ఆమెకు భీముడికి పుట్టిన వాడే మహాబలాడ్యుడు ఘటోత్కచుడు. భీముడితో జరిగిన యుద్ధంతో హిడింబాసురుడు మరణిస్తాడు. అంతకు ముందే భీముడిపై మనసుపారేసుకుంటుంది హిడింబి. భీముడితో వివాహం జరిపించమని కుంతిదేవిని వేడుకుంటుంది. కుంతి అంగీకారంతో భీముడు, హిడింబిలు పెళ్లి చేసుకుంటారు. అలా భీముడు-హిడింబిలకు పుట్టినవాడే ఘటోత్కచుడు. ఘటోత్కచుడు పెరిగి పెద్దవాడై రాజ్యపాలనాభారాన్ని తీసుకున్న తర్వాత హిడింబి హిమాలయాలకు వెళ్లిపోయింది. అక్కడ తపస్సు చేసింది. అనేక దివ్యశక్తులను పొందింది. కోరికలు తీర్చే దేవత అయ్యి..మనాలిలో భక్తుల పూజలందుకుంటోంది..

ఈ హిడింబి మాత దేవాలయాన్యని మహారాజా బహదూర్‌సింగ్ నిర్మించాడు. 1553లో హిడించా పేరుతో పగోడా తరహాలో ఈ అద్భుత ఆలయాన్ని నిర్మించాడు. దట్టమైన దేవదారు వృక్షాల మధ్య ఉన్న ఈ ఆలయంలో ఎప్పుడూ ఓ అగ్నిహోత్రం వెలుగుతూ ఉంటుంది.. తమకు ఎలాంటి సమస్య ఎదురైనా ఎలాంటి ఆపద సంభవించినా ప్రజలు హిడింబామాతను వేడుకుంటారు…నిండుమనసుతో పూజలు చేసి ఆమె దీవెనలు అందుకుంటారు. ఏడాదిలో కొన్ని రోజులు మినహా మిగిలిన కాలమంతా హిడింబి ఆలయంలో మంచుపేరుపోయి ఉంటుంది. ఈ ఆలయాన్ని మొత్తం చెక్కతో నిర్మించారు. దేవాలయం నాలుగు అంతస్తులున్నాయి. చతురస్ర్త ఆకారంలో ఉన్న నాలుగు అంతస్తుల్లో మూడు చెక్కతో కట్టినవే. హిడింబి ఆలయంలోపల ఓ పెద్దరాయి మీద ఆమె పాదముద్ర కూడా ఉంది..

ఫ్లోరింగ్ కూడా చెక్కతో ఉంటుంది. ఒక నాలుగో అంతస్థుని ఇత్తడితో కవర్ చేశారు. ఈదేవాయలం శిఖరం ఎత్తు 24 మీటర్లు. గుడి ద్వారాలు కూడా చక్కటి నగిషీలతో ఆకర్షణీయంగా ఉంటాయి. గర్భగుడిలో హిడింబామాత విగ్రహం మూడు అంగుళాల ఎత్తు మాత్రమే ఉంటుంది. ఈ గుడికి 70 మీటర్ల దూరంలో హిడింబి మాత కుమారుడు ఘటోత్కచుడి ఆలయం ఉంటుంది. అత్యంత వైభవంగా కన్నుల పండుగగా జరిగే దూండ్రీ ఉత్సవాల కోసమే పర్యాటకులు ఎదురుచూస్తూ ఉంటారు..

కులు రాజులకు హిడింబిమాత కులదైవం..హిడింబి జన్మదినాన్ని పురస్కరించుకునే దూంగ్రీ మేళాను నిర్వహించి దున్నలను బలి ఇచ్చేవారు. యువతులు సంప్రదాయ దుస్తులు ధరించి..సంప్రదాయ నృత్యం కుల్లు నట్టితో మేళాను రంగుల మయం చేస్తారు. అమ్మ కోసం ప్రార్థనలు చేస్తారు. యువకులు బియ్యంతో చేసిన బీరును తాగుతారు. దుంగ్రీ మేళా సందర్భంగా స్థానిక ఆలయాల నుంచి ఉత్సవమూర్తులను ఇక్కడికి తరలిస్తారు. సిమ్సా నుంచి కత్రిక్‌స్వామి. పార్షా నుంచి చండాల్‌ రుషి. అలయో నుంచి శ్రిష్టి నారాయణ్‌. జగత్‌సుఖ్‌ నుంచి శ్రీగన్హ్‌. షాజ్లా నుంచి విష్ణు. సియల్‌ నుంచి మహాదేవి. నసోగి నుంచి నారాయణ్‌ దేవతామూర్తులు దుంగ్రీ మేళాకు అతిథులుగా వస్తాయి. ఉత్సవాలు పూర్తయ్యాక మేళా మనాలి గ్రామంలోని మను ఆలయానికి తరలివెళుతుంది..