Himachal Pradesh: ఎన్నికల్లో గెలిచి నెలైనా కాలేదు. అప్పుడే మాట తప్పిన కాంగ్రెస్

బీజీపీపై తీవ్ర విమర్శలు చేస్తూ వస్తోంది. అందులో ముఖ్యంగా ధరల పెంపు.. నిత్యవసరాల ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు వంటి వాటిని కాంగ్రెస్ తరుచూ ప్రస్తావిస్తూ ఉంటుంది. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఇంధన ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే.. ఆ ధరల్ని తగ్గిస్తామని రాహుల్ గాంధీ సహా ఇతర కాంగ్రెస్ నేతలు తరుచూ చెప్పే మాటే.

Himachal Pradesh: ఎన్నికల్లో గెలిచి నెలైనా కాలేదు. అప్పుడే మాట తప్పిన కాంగ్రెస్

Himachal Pradesh government increases VAT on diesel

Himachal Pradesh: ఎన్నికల ముందు అనేక హామీలు ఇవ్వడం, తీరా అధికారంలోకి రాగానే మాట తప్పడం దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలకు అలవాటే. బీజేపీ, కాంగ్రెస్, స్థానిక పార్టీలు.. కాదేదీ ఇందుకు అనర్హం. అయితే ఎనిమిదేళ్లుగా ప్రతిపక్ష స్థానంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. బీజీపీపై తీవ్ర విమర్శలు చేస్తూ వస్తోంది. అందులో ముఖ్యంగా ధరల పెంపు.. నిత్యవసరాల ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు వంటి వాటిని కాంగ్రెస్ తరుచూ ప్రస్తావిస్తూ ఉంటుంది. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఇంధన ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే.. ఆ ధరల్ని తగ్గిస్తామని రాహుల్ గాంధీ సహా ఇతర కాంగ్రెస్ నేతలు తరుచూ చెప్పే మాటే.

Congress-2023: కాంగ్రెస్ పార్టీకి మెడపై కత్తిలా 2023.. ఏమాత్రం పట్టు తప్పినా పార్టీ గోతిలో పడ్డట్టే

కానీ, ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ సైతం తన విమర్శలకు అనుగుణంగానే వ్యవహరించింది. అధికారంలోకి వచ్చి ఒక్క నెలంటే నెల రోజులు కూడా కాలేదు. అప్పుడే డీజిల్ మీద బాదుడు ప్రారంభించింది. ఇటీవల జరిగిన హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దేశ వ్యాప్తంగా పెరిగిన ధరలపై ఓవైపు కాంగ్రెస్ నిరసన చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం తాజాగా డీజిల్‭పై వ్యాట్ పెంచింది.

Varun Gandhi: బీజేపీకి టాటా.. తొందరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరనున్న వరుణ్ గాంధీ?

గతంలో డీజిల్‌పై 4 రూపాయల 40 పైసలు వ్యాట్ ఉండగా ప్రస్తుతం మరో 3 రూపాయల్ని హిమాచల్ ప్రభుత్వం పెంచింది. దీంతో వ్యాట్ 7 రూపాయల 40 పైసలకు చేరి, హిమాచల్ ప్రదేశ్‌లో ప్రస్తుతం లీటర్ డీజిల్ ధర 86 రూపాయలకు చేరింది. హిమాచల్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు తీసుకున్న ఈ నిర్ణయంపై విపక్ష బీజేపీ మండిపడింది. ఎన్నికల్లో గెలవగానే ప్రజలపై పన్నులు విధించడం ప్రారంభించారని బీజేపీ సీనియర్ నేత, హిమాచల్ ప్రదేశ్ మాజీ మంత్రి సురేశ్ భరద్వాజ్ మండిపడ్డారు.