కుక్కర్ తో N – 95 ఫేస్ మాస్క్ శానిటైజ్

  • Published By: madhu ,Published On : August 11, 2020 / 10:40 AM IST
కుక్కర్ తో N – 95 ఫేస్ మాస్క్ శానిటైజ్

కరోనా వైరస్ కట్టడి చేసేందుకు ప్రధానంగా మాస్క్ తప్పనిసరిగా మారిపోయింది. ఎన్ – 95 మాస్క్ లు సురక్షతమని భావించి చాలా మంది దానిని ఉపయోగిస్తున్నారు. ప్రతి రోజు బయటకు వెళ్లే వారు మాస్క్ ల విషయంలో సమస్యలను ఎదుర్కొంటున్నారు.



ఒక మాస్క్ ఉంటే..దానిని ప్రతి రోజు ఉతకాల్సిన అవసరం ఏర్పడుతోంది. కానీ అందులో ఉండే వైరస్ చనిపోతుందా ? లేదా అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి. ఎన్ – 95 మాస్క్ లు కాస్ట్లీగా ఉండడంతో సామన్య, మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

మళ్లీ, మళ్లీ వినియోగిస్తే సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. కానీ..ఈ విషయంలో సైంటిస్టులు కొత్త విషయాన్ని చెప్పుకొచ్చారు.
ఇంట్లో ఉండే ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్, హీట్ పాట్ లతో మాస్కులను సమర్థవంతంగా క్లీన్ చేయవచ్చని ఇల్లినాయీ యూనివ‌ర్సిటీ సైంటిస్టులు వెల్లడిస్తున్నారు.



ఎన్ -95 మాస్క్ లను కుక్కర్ లో 100 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద వేడి చేయడం ద్వారా..అవ పూర్తిగా క్లీన్ అవుతాయంటున్నారు. ఈ పద్ధతి ద్వారా..20 సార్లు…మాస్క్ ను శానిటైజ్ చేయొచ్చని వెల్లడించారు. N-95 Mask కు ఉండే చిన్న ఫిల్టర్ శుద్ధి చేస్తుందని ప్రొ. Thanh Nguyen తెలిపారు. మాస్క్ ధరించకపోతే ప్రమాదం తప్పదని హెచ్చరిస్తున్నారు.