Cyber Security: సైబర్ క్రైమ్ ఫిర్యాదుల కోసం కొత్త హెల్ప్‌లైన్ నెంబర్..

డిజిటల్ లావాదేవీల యుగం పెరుగుతున్న క్రమంలో దేశంలో సైబర్ నేరాలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి.

Cyber Security: సైబర్ క్రైమ్ ఫిర్యాదుల కోసం కొత్త హెల్ప్‌లైన్ నెంబర్..

Cyber Crime

Cyber Security: డిజిటల్ లావాదేవీల యుగం పెరుగుతున్న క్రమంలో దేశంలో సైబర్ నేరాలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. సైబర్ నేరస్థులు రోజుకో మార్గంలో ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతూ ఉన్నారు. దీన్ని పరిష్కరించేందుకు, ఫిర్యాదు కోసం కేంద్ర ప్రభుత్వం 155260 నంబర్‌ను జారీ చేసింది.

కానీ ఇప్పుడు ఈ నెంబర్‌కు బదులుగా, మరొక నెంబర్‌ను ప్రారంభించింది. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సూచనల మేరకు ఈ నెంబర్ జారీ చేసింది. కొత్తగా జారీ చేసిన నెంబర్‌కు కాల్ చేయడం ద్వారా సైబర్ క్రైమ్ బాధితులు ఫిర్యాదు చేయవచ్చు.

హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ 155260కి బదులుగా 1930 హెల్ప్‌లైన్ నంబర్‌ను జారీ చేసింది. సైబర్ క్రైమ్ కేసుల సంఖ్య పెరుగుతుండగా.. హోం మంత్రిత్వ శాఖ సూచనల మేరకు పోలీసు శాఖ కొత్త సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930ని ప్రారంభించింది.

సైబర్ నిపుణుడు శ్యామ్ చందేల్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెంబర్ ఆపరేట్ చేయబడిన టోల్ ఫ్రీ నెంబర్ 155260 స్థానంలో ఉంటుంది. టోల్ ఫ్రీ నెంబర్ దశలవారీగా మారుతుంది. కొత్త సైబర్ హెల్ప్‌లైన్ నంబర్ 1930తో పాటు పాత 155260 నంబర్ కూడా పని చేస్తుంది.

తక్షణమే ఫిర్యాదు చేయవచ్చు:
దేశంలో డిజిటల్, ఆన్‌లైన్ బ్యాంకింగ్ ట్రెండ్ వేగంగా పెరిగిందని, సైబర్ క్రైమ్‌లకు సంబంధించిన సంఘటనలు కూడా ప్రతిరోజూ పెరుగుతూ ఉన్నాయని అన్నారు. మాకు ఇలాంటివి జరిగినప్పుడల్లా, సమాచారం లేకపోవడం వల్ల మోసాలు పెరిగిపోతున్నాయని, అటువంటి పరిస్థితిలో, కొన్ని పద్ధతుల ద్వారా, ప్రజలు తమ ఫిర్యాదును నిమిషాల్లో నమోదు చేయవచ్చని చెబుతున్నారు. ఇందుకోసం ముందుగా దరఖాస్తుదారులు సైబర్ పోర్టల్‌లో తమ ఫిర్యాదును నమోదు చేసుకోవచ్చు. దీని కోసం అధికారిక పోర్టల్(https://cybercrime.gov.in/)కు కూడా వెళ్లవచ్చు.

రికవరీ సాధ్యమే:
సైబర్ నిపుణుడు శ్యామ్ చందేల్ మాట్లాడుతూ.. సైబర్ మోసం జరిగిన వ్యక్తి 1930 నంబర్‌కు కాల్ చేసి పూర్తి సమాచారం ఇస్తే, ఏ అకౌంట్ నుంచి అమౌంట్ కట్ అయ్యిందో? మోసం జరిగిందో? పూర్తిగా వెనక్కి తెచ్చుకోవచ్చు అని చెబుతున్నారు.