Car బ్రేక్ ఫెయిల్ అయిందా.. 8సెకన్లలో ఆపేయండిలా

Car బ్రేక్ ఫెయిల్ అయిందా.. 8సెకన్లలో ఆపేయండిలా

వేగంగా వెళ్తున్న వాహనానికి బ్రేక్ ఫెయిల్ అయితే ఏం చేయాలి. ఓరి దేవుడా.. అనుకుని మనకు తోచిన ప్రయత్నాలన్నీ చేసి Car ఆపడానికి ట్రై చేస్తాం. ఇలాంటి డేంజరస్ పరిస్థితి ఎవరికీ రాకూడదు కానీ వస్తే వెహికల్ ను ఆపడానికి ఏం చేయాలి. రీజన్ తెలిస్తే సమస్యను త్వరగా సాల్వ్ చేయొచ్చు. ఆ టెన్షన్ లో రీజన్ తెలుసుకునేంత గ్యాప్ ఉండకపోవచ్చు.

నిజానికి దానికి చాలా కారణాలు ఉండొచ్చు. బ్రేక్ వైర్ తెగిపోవడం, మాస్టర్ సిలిండర్ లీక్ అవడం, బ్రేక్ వేయడానికి అవసరమైన ప్రెజర్ అంతా లీక్ అయిపోవడం వంటివి కావొచ్చు. ఏదేమైనా వెహికల్ ఆపడానికి ఉన్న టెక్నిక్స్ మాత్రం అనేకం. ఆపడానికి సేఫెస్ట్ గా ఏం చేయాలంటే..



Knowledge Kingdom అనే యూట్యూబ్ ఛానెల్ వీడియోలో ఉన్న దానిని బట్టి.. బ్రేక్స్ ఫెయిల్ అయితే 8సెకన్లలో కారు ఆపేయొచ్చు. మొదటగా బ్రేక్ ఫెయిల్ అయిందని కంగారుపడకుండా ఉండటానికి ప్రయత్నించాలి. ఎక్సిలేటర్ పెడల్ మీద నుంచి కాలిని తీసేయాలి.

వెంటనే హ్యాండ్ బ్రేక్ గట్టిగా సగం వరకూ లాగేందుకు మాత్రమే ప్రయత్నించాలి. ఒకవేళ దానిని పూర్తిగా లాగేస్తే రేర్ వీల్స్ లాక్ అయిపోయి డ్రైవర్ కంట్రోల్ చేయలేకపోవచ్చు. హ్యాండ్ బ్రేక్ ట్రై చేస్తుండగానే.. నిదానంగా బ్రేక్స్ డౌన్ చేసేందుకు ట్రై చేయాలి. అలా చేసే క్రమంలో గేర్స్ ను స్కిప్ చేయకూడదు.

ఉదాహరణకు 5వ గేర్ నుంచి నేరుగా 3వ గేర్ కు అలా చేయకూడదు. 5తర్వాత 4తర్వాత 3 అలా డౌన్ చేసుకోవాలి. ఇలా హ్యాండ్ బ్రేక్, ఇంజిన్ బ్రేకింగ్ యూజ్ చేసి షిఫ్ట్ చేయడం ద్వారా డ్రైవర్ కారు అదుపు చేయొచ్చు.

గంటకు 60కి.మీల వేగంతో ఉన్న కారును 8సెకన్లలో డౌన్ చేసేయొచ్చు. స్పీడ్ ఎక్కువగా ఉంటే కంట్రోల్ చేయడానికి ఎక్కువ సమయం పట్టొచ్చు. అంతకుమించి వేగంతో వెళ్తుంటే.. ఇతర వాహనాలను తప్పించి.. సైడ్ రైల్స్ లేదా ఏదైనా పొదల్లోకి పోనించి కారు వేగం తగ్గించడానికి ప్రయత్నించాలి.