హైడ్రాక్సీక్లోరోక్విన్ తో ప్రాణాలు పోయే అవకాశం…నిపుణుల హెచ్చరిక

  • Published By: venkaiahnaidu ,Published On : May 7, 2020 / 10:33 AM IST
హైడ్రాక్సీక్లోరోక్విన్ తో ప్రాణాలు పోయే అవకాశం…నిపుణుల హెచ్చరిక

COVID-19 రోగులకు యాంటీ మలేరియా డ్రగ్ హైడ్రాక్సీక్లోరోక్విన్ పనిచేయట్లేదని నిపుణులు చెబుతున్నారు. కరోనా పేషెంట్లకు ఇది ఒక అద్భుతమైన ఔషదం కాదని, కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకం కూడా అయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. కరోనాకు పూర్తిస్థాయి వ్యాక్సిన్‌ను డెవలప్ చేసే ప్రయత్నాలు జరుగుతున్న సమయంలో హైడ్రాక్సీక్లోరోక్విన్(HCQ)సంజీవనిగా మారింది.

కరోనా పేషెంట్లపై యాంటీ మలేరియా డ్రగ్ సమర్థవంతగా పనిచేస్తోందని అమెరికా గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. అమెరికా ఎఫ్ డీఐ HCQను కరోనా రోగులపై వాడేందుకు ఆమోదం తెలిపింది. మహమ్మారి వ్యాప్తి మరియు COVID-19కేసులు పెరుగుతున్న సమయంలో అత్యవసరం దృష్ట్యా సమర్థవంతమైన చికిత్స కోసం, అమెరికాతో సహా అనేక దేశాలు HCQ పై ఎక్కువగా ఆధారపడటం ప్రారంభించాయి.

అమెరికా సహా ప్రపంచంలోని పలు దేశాలు కోరడంతో…మానవతా దృష్ట్యా ఆయా దేశాలకు హైడ్రాక్సీక్లోరోక్విన్ ట్యాబ్లెట్లను భారత్ పంపించిన విషయం తెలిసిందే. అయితే HCQ పై ఈ ఆధారపడటం వెంటనే ఆగిపోవాలని నిపుణులు చెబుతున్నారు. COVID-19 ట్రీట్మెంట్ లో హైడ్రాక్సీక్లోరోక్విన్ ప్రయోజనకరంగా ఉందని నిరూపించడానికి ఎలాంటీ శాస్త్రీయ ఆధారాలు లేవంటూ డిబేట్ పలువురు తమ వాయిస్ ను వినిపిస్తున్న సమయంలో ఇప్పుడు ఆ వాయిస్ కు తమ గొంతును జోడించారు నిపుణులు. 

కరోనా వైరస్ కు ఇప్పటివరకు ఎలాంటి ఖచ్చితమైన చికిత్స అందుబాటులో లేనందున, కోవిడ్ -19 రోగులకు చికిత్స చేయడానికి వైద్యులు ఇతర యాంటీవైరల్ మందులతో పాటు (HIV మరియు ఇతర వైరల్ ఇన్ఫెక్షన్లలో వాడేటివి) ప్రయోగధార థెరపీగా హైడ్రాక్సీక్లోరోక్విన్ ని ఉపయోగిస్తున్నారనేది కేవలం ఉదాంత ఆధారాలే అని ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)మాజీ డైరెక్టర్ మరియు భారతదేశపు టాప్ సర్జన్లలో ఒకరైన ఎమ్ సీ మిశ్రా అన్నారు. అయితే, హైడ్రాక్సీక్లోరోక్విన్ కారణంగా కొంతమంది రోగులు కార్డియాక్ అరిథ్మియాను అభివృద్ధి చేస్తున్నట్లు నివేదికలు వచ్చాయని, ఇది ఆకస్మిక గుండె మరణానికి కారణమవుతుందని అని మిశ్రా చెప్పారు. ఎయిమ్స్ కోవిడ్ -19 బృందంలోని కోర్ సభ్యుడు యుధ్యవీర్ సింగ్ దీనిని అంగీకరించారు.

ప్రపంచవ్యాప్తంగా, HCQ నిర్వహణ మరియు అజిత్రోమైసిన్ వల్ల కొన్ని మరణాలు నివేదించబడ్డాయి. HCQ పొటాషియం ఛానెల్‌ను బ్లాక్ చేస్తుంది మరియు  ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్ మరణం మరియు వివిధ అరిథ్మియాస్ పరిణామాలతో QTc (హృదయ స్పందన)ని సమర్థవంతంగా పొడిగించగలదు. ఇది ప్రముఖ అధ్యయనాలలో(prominent studies)కూడా నమోదు చేయబడిందని మిశ్రా వివరించారు.COVID-19 ట్రీట్మెంట్ కు HCQ వాడకంపై కొన్ని విరుద్ధమైన రిపోర్ట్ లు ఉన్నాయని ఎయిమ్స్‌లోని అనస్థీషియా అసిస్టెంట్ ప్రొఫెసర్ తెలిపారు.

Also Read | షాకింగ్ : మృతదేహాల మధ్యలో కరోనా పేషెంట్లకు ట్రీట్మెంట్