PM kisan Scheme: మీ ఖాతాలో పీఎం కిసాన్ నగదు జమకాలేదా?.. ఈ ఐదు తప్పులు సరిచేసుకోండి

ఆర్థికంగా వెనుకబడిన చిన్నసన్నకారు రైతులకోసం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనను ప్రారంభించింది. రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడమే ఈ పథకం ఉద్దేశం. ఈ పథకం కింద అర్హతఉన్న ప్రతి రైతుకు ఏటా 6వేల రూపాయలు అందజేస్తారు. ఈ డబ్బు మూడు విడతల్లో 2వేలచొప్పున అందిస్తారు. ఈ పథకం కింద 11వ విడత నిధులను మే31న ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన విషయం విధితమే.

PM kisan Scheme: మీ ఖాతాలో పీఎం కిసాన్ నగదు జమకాలేదా?.. ఈ ఐదు తప్పులు సరిచేసుకోండి

Pm Kisan

PM kisan Scheme: ఆర్థికంగా వెనుకబడిన చిన్నసన్నకారు రైతులకోసం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనను ప్రారంభించింది. రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడమే ఈ పథకం ఉద్దేశం. ఈ పథకం కింద అర్హతఉన్న ప్రతి రైతుకు ఏటా 6వేల రూపాయలు అందజేస్తారు. ఈ డబ్బు మూడు విడతల్లో 2వేలచొప్పున అందిస్తారు. ఈ పథకం కింద 11వ విడత నిధులను మే31న ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన విషయం విధితమే. ప్రధాని మోదీ దాదాపు రూ. 21,000 కోట్ల మొత్తాన్ని 10 కోట్లకుపైగా లబ్ధిదారులైన రైతు కుటుంబాలకు బదిలీ చేశారు. అయితే పీఎం కిసాన్ పథకం నిధులు ఇప్పటికి తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది రైతులకు చేరలేదు. దీంతో వారు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి ఆరాతీసిన పథకంపై స్పష్టమైన సమాచారం దొరక లేదు.

 

Pm Kisan (2)

ఈ ఏడాది పీఎం కిసాన్ నిధులు రావాలంటే అర్హత కలిగిన ప్రతీఒక్కరూ తప్పనిసరిగా ఈ–కేవైసీ నమోదు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ-కేవైసీ చేయించుకున్న రైతుల ఖాతాల్లోనే నగదు జమ అయింది. అయితే కొందరు లబ్ధిదారులకు ఈ-కేవైసీ చేయించుకున్నప్పటికీ ఖాతాల్లో నగదు జమ కాలేదు. లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలోకి పీఎం కిసాన్ 11వ విడత నిధులు జమకాకపోవటానికి ఐదు కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. వీటిని సరిచేసుకుంటే అర్హులైన రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ నగదు జమయ్యే అవకాశాలు ఉన్నాయి.

Pm Kisan (1)

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కోసం దరఖాస్తు చేస్తున్నప్పుడు లబ్ధిదారుడు పేరుకు సంబంధించి స్పెల్లింగ్ తప్పుగా నమోదు చేసినట్లయితే మీ భూమికి సంబంధించి పత్రాలు సరిపోలక నగదు నిలిచిపోయే అవకాశం ఉంది. పేరు నమోదు చేసే క్రమంలో తప్పనిసరిగా స్పెలింగ్ లో తప్పులు లేకుండా చూసుకోవాలి.
లబ్ధిదారుడు అందించిన చిరునామా తప్పుగా ఉన్నట్లయితే, వెంటనే దానిని మీ పీఎం కిసాన్ ఖాతాలో సరిచేయాలి.
ఆధార్ వివరాలను తప్పుగా నమోదు చేసినట్లయితే లబ్ధిదారుడు ఖాతాలోకి నగదు చేరదు. అర్హత కలిగిన రైతులు తిరిగి ఆధార్ వివరాలు తప్పులు లేకుండా నమోదు చేస్తే నగదు బ్యాంకు ఖాతాలో జమయ్యే అవకాశం ఉంది.
అసంపూర్తిగా ఉన్న e-KYC వల్ల కూడా మీ ఖాతాలోకి నగదు జమ కాకపోవటానికి కారణంగా చెప్పవచ్చు.
లబ్ధిదారుడు e-KYCని పూర్తి చేయడానికి చివరి తేదీ గడువును కేంద్ర ప్రభుత్వం పెంచింది. మే31 నుండి జూలై31వరకు గడువు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.