Fifa 2022: కలిసి ఫుట్‭బాల్ వీక్షించేందుకు రూ.23 లక్షలు పెట్టి ఇళ్లు కొన్నారు

దీంతో కుటుంబ సభ్యులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఈసారి ఫిఫా వరల్డ్ కప్ వీక్షించాలని అనుకున్నారు. అందుకు ఒక ఇల్లు కావాలని నిర్ణయించుకున్నారు. అంతే.. గ్రామంలో ఒక ఇంటిని చూసి 23 లక్షల రూపాయలకు కొనేశారు. ఆ ఇంటిని చూస్తే ఫుట్‭బాల్ గుర్తుకు వచ్చేలా తయారు చేశారు. బ్రెజిల్, అర్జెంటీనా, పోర్చుగల్ రంగులతో నింపేశారు..

Fifa 2022: కలిసి ఫుట్‭బాల్ వీక్షించేందుకు రూ.23 లక్షలు పెట్టి ఇళ్లు కొన్నారు

In Kerala football fans buy Rs 23 lakh house to watch FIFA matches

Fifa 2022: ఫిఫా వరల్డ్ కప్ నేపథ్యంలో ప్రపంచాన్ని ఫుట్‭బాల్ ఫీవర్ కుదిపేస్తోంది. కొంతమంది ఇప్పటికే టీవీలకు అతుక్కుపోగా, ఎంత ఖర్చైనా సరే ప్రత్యక్షంగా చూడాలని సాహసం చేస్తున్నవారు మరికొందరు. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ చూసినా ప్రస్తుతం ఫిఫా వరల్డ్ కప్ గురించే చర్చ జరుగుతోంది. అనుకుంటాం కానీ మన దేశంలో కూడా ఫుట్‭బాల్ అభిమానులు ఎక్కువగానే ఉన్నారు. క్రికెట్ కారణంగా మిగతా క్రీడాభిమానుల చర్చ పెద్దగా రాదు కానీ, కొన్ని ప్రత్యేక సంఘటనల వల్ల మన దేశంలో ఆయా క్రీడలకు ఉండే ఆదరణ వెల్లడవుతూనే ఉంటుంది.

ఫుట్‭బాల్‭కు మన దేశంలో ఎంత క్రేజ్ ఉందో కేరళలో కొంత మంది మంచి ఉదాహరణ. అందరూ కలిసి ఒక చోట ఫుట్‭బాల్ చూసేందుకు ఏకంగా 23 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇళ్లు కొన్నారంటే మాటలు కాదు. కేరళలోని కొచ్చి జిల్లాలో ఉన్న ముందక్కముగల్ గ్రామంలో 17 మంది ఫుట్‭బాల్ ప్రేమికులు కలిసి చేసిన పని ఇది. వాస్తవానికి వీరంతా ఫుట్‭బాల్ ప్రేమికులు. రెండు దశాబ్దాలుగా ఫుట్‭బాల్ కలిసే చూస్తున్నారు. ప్రతిసారి ఎవరో ఒకరి ఇంటి వద్ద చూసేవారు. ఆ సందర్భాల్లో ఇంట్లో జరిగే హడావుడి అంతా ఇంతా కాదు. అయితే ఇది కొన్నిసార్లు ఇంట్లో వాళ్లకి ఇబ్బందిగా మారుతోంది.

దీంతో కుటుంబ సభ్యులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఈసారి ఫిఫా వరల్డ్ కప్ వీక్షించాలని అనుకున్నారు. అందుకు ఒక ఇల్లు కావాలని నిర్ణయించుకున్నారు. అంతే.. గ్రామంలో ఒక ఇంటిని చూసి 23 లక్షల రూపాయలకు కొనేశారు. ఆ ఇంటిని చూస్తే ఫుట్‭బాల్ గుర్తుకు వచ్చేలా తయారు చేశారు. బ్రెజిల్, అర్జెంటీనా, పోర్చుగల్ రంగులతో నింపేశారు. మెస్సీ, రొనాల్డో సహా ఇతర ఆటగాళ్ల ఫొటోలు అతికించారు. ఫిఫా జెండాలు కట్టారు. వీటితో పాటు ఆట చూసేందుకు ఒక పెద్ద స్క్రీన్ ఏర్పాటు చేశారు. వచ్చే తమ తరాలకు కూడా ఇది అందుబాటులో ఉండాలని వారు పేర్కొన్నారు.

MCD elections: ఆప్ ఎమ్మెల్యేకు ఘోర అవమానం.. దాడి చేసి తరిమికొట్టిన సొంత పార్టీ కార్యకర్తలు