Assembly elections : తమిళనాడులో అతిపెద్ద ఎన్నికల పోరు.. కుర్చీ కోసం కొట్లాట!

తమిళనాడులో కొత్త ప్రభుత్వం కోసం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈసారి ఒకే విడతలో పోలింగ్ జరుగుతోంది. తమిళనాడు ఎన్నికలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. మొత్తం 234 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది.

Assembly elections : తమిళనాడులో అతిపెద్ద ఎన్నికల పోరు.. కుర్చీ కోసం కొట్లాట!

Eps's Biggest Election Against Dmk Congress

Tamil Nadu Assembly elections : తమిళనాడులో కొత్త ప్రభుత్వం కోసం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈసారి ఒకే విడతలో పోలింగ్ జరుగుతోంది. తమిళనాడు ఎన్నికలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. మొత్తం 234 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఈసారి ఎన్నికల్లో పార్టీలు, కూటములతో పార్టీలు అధికారం కోసం పోటీపడుతున్నాయి. బీజేపీ కూటమితో అధికార పార్టీ అన్నాడీఎంకే మొత్తం 234 స్థానాల్లో కేవలం 179 స్థానాల్లో పోటీ చేస్తోంది. మిగిలిన 20 స్థానాలను బీజేపీకి కేటాయించింది. మిగతా సీట్లను ఇతర పార్టీలకు కేటాయించింది. మరోవైపు డీఎంకే కూటమిలో 173 స్థానాల్లో పోటీచేస్తోంది.. మిత్ర పక్షమైన కాంగ్రెస్ 25 స్థానాలు కేటాయించింది.

ఇతర పార్టీలకు 12 సీట్లు కేటాయించింది. తమిళనాడులో ఐకానిక్ పొలిటికల్ లీడర్లలో జయలలిత (2016లో మరణించారు), ఎం కరుణానిధి (2018లో మరణించారు) ఈసారి లేరు. జయలలిత మరణం తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు కావడంతో అధికారం కోసం అన్నాడీఎంకే, డీఎంకేలు నువ్వానేనా అన్నట్టుగా పోటీపడుతున్నాయి. జయలలిత మరణం అనంతరం ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్) అనుకోకుండా ముఖ్యమంత్రి అయ్యారు. చిన్నమ్మ శశికళ ఈపీఎస్ ను సీఎం చేశారు. మరోవైపు డీఎంకే నేత ఎంకే స్టాలిన్ అధికారాన్ని చేజిక్కిచుకునేందుకు పావులు కదుపుతున్నారు. దశబ్ద కాలంపాటు చేజారిన అధికారాన్ని ఎలాగైనా దక్కించుకుని సీఎం సీటు కోసం స్టాలిన్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.

పళనిస్వామి ఎడప్పాడి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుండగా.. స్టాలిన్ కొల్తార్ బ్యాలెట్ నుంచి పోటీ చేస్తున్నారు. మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ సొంతంగా పోటీ చేయలనుకున్నా పరిస్థితులు అనుకూలించలేదు. తప్పక ఇతర పార్టీలతో జత కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2019 సాధారణ ఎన్నికల్లో పోటీచేసినప్పటికీ కమల్ ఒక సీటు కూడా గెల్చుకోలేదు. కానీ, ఇప్పుడు చాలా నమ్మకంతో కనిపిస్తున్నారు. ఈసారి కూటమితో పోటీలో నిలబడిన కమల్.. కోయంబత్తూరు దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ అధికార పార్టీ అన్నాడీఎంకే, ప్రతిపక్ష పార్టీ డీఎంకే పోటీలో లేకపోవడం కమల్ కు బాగా కలిసొచ్చిన అంశంగా కనిపిస్తోంది. అందుకే ఈసారి గెలుస్తాననే ధీమాతో ఉన్నారు.

బీజేపీ అభ్యర్థి వనాతి శ్రీనివాసన్ తో పోటీగా కమల్ బరిలో దిగారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఈ ఏడాదిలో తమిళనాడులో కొంచెం పుంజుకున్నట్టే కనిపిస్తోంది. ఈ రెండు పార్టీలు ఎన్నికల ప్రచారంలో గట్టిగానే పనిచేశాయి. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒకవైపు.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోవైపు విస్తృతంగా ప్రచారంలో పాల్గొన్నారు. తమిళనాడులో మంగళవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలైంది. కరోనా నిబంధనలు, సామాజిక దూరాన్ని పాటిస్తూ పోలింగ్ బూత్ లను 8900 వరకు పెంచారు. రాష్ట్రంలో మొత్తం 234 నియోజకవర్గాలకు మొత్తంగా 3998 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. 6.3 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. తమిళ ఎన్నికల ఫలితాలు మే 2న ప్రకటించనున్నారు.