42 దేశాలకు ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ ఆయుధాల ఎగుమతి

42 దేశాలకు ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ ఆయుధాల ఎగుమతి

ఇండియన్ టెక్నాలజీ యుద్ధరంగంలోనూ ఊపందుకుంటుంది. ప్రపంచ దేశాలకు యుద్ధ పరికరాలు ఎగుమతి చేసేంత ఎదిగింది. ఈ క్రమంలో అమెరికా, ఆస్ట్రేలియా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఇజ్రాయేల్, దక్షిణాఫ్రికా, స్వీడన్‌ల సరసన చేరింది. భారత్ ఎగుమతి చేస్తున్న 42దేశాల్లో అజెరబైజన్, సీచెల్లెస్, ఇస్టోనియా, ఇండోనేషియా, గినియా, ఫిలిప్పైన్స్ వంటి దేశాలు ఉన్నాయి. కేంద్ర డిఫెన్స్ మినిస్టర్ శ్రీపాద్ నాయక్ రాజ్యసభకు సోమవారం సమధానమిచ్చారు. 

‘ఒక్కో పరికరం యొక్క విదేశీ మారక విలువలు కంపెనీ.. కంపెనీకి మారుతున్నాయి. మంత్రిత్వ శాఖ వీటి వివరాలన్ని రికార్డ్ చేసి ఉంచలేదు. భారత్ ఆస్ట్రేలియాకు 5.56x45mm Ball MK N(SS109) cartridges వంటి పరికరాలు అందించడంతో పాటు అజెర్‌బైజన్‌కు హెల్మెట్లు, బాంబ్ నుంచి తట్టుకునే దుప్పట్లు, జర్మనీకి సాఫ్ట్ ఆర్మర్ ప్యానెల్స్, గినియాకు స్లీపింగ్ బ్యాగులు, ఇజ్రాయెల్‌కు మోర్టర్ షెల్ కవర్లు, నెదర్లాండ్స్, యూఎస్ లకు హార్డ్ ఆర్మర్ ప్లేట్లు , సింగపూర్ కు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, హెల్మెట్లు, దక్షిణాఫ్రికకు డిటనేటర్లు, థాయ్‌లాండ్‌కు రాత్రిళ్లు కనిపించేందుకు వాడే బైనాక్యులర్లు ఎగుమతి చేస్తుంది. 

శరీరానికి రక్షణగా ఉండే పరికరాలను ఖతర్, లెబనాన్, ఇరాక్, ఈక్వెడార్, ఉరుగ్వే, జపాన్, ఈజిప్ట్‌లకు ఎక్స్‌పోర్ట్ చేస్తుంది.  2014లో ప్రధాని మోడీ ఆరంభించిన మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాంలో భాగంగా డిఫెన్స్ మాన్యుఫ్యాక్చరింగ్‌లో చాలా అభివృద్ధి వచ్చింది. ఎగుమతి చేసుకోవడంతో పాటు దిగుమతిలోనూ భారత్ రెండో స్థానంలో ఉంది. ఆయుధాలు దిగుమతి చేసుకుంటున్న దేశాలలో సౌదీ ఆరేబియా మొదటి స్థానంలో ఉంటే భారత్‌ది సెకండ్ ప్లేస్ అని స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ వెల్లడించింది. 

డిఫెన్స్ ఎక్స్‌పో ఈవెంట్‌లో పాల్గొని మాట్లాడిన మోడీ విదేశీ మాన్యుఫ్యాక్చర్లు భారత్ లో పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు. భారత్ 2014 నాటికి రూ.2వేల కోట్లు రాబట్టిందని అన్నారు. తర్వాత రెండేళ్లలోనే రూ.17వేల కోట్లు సంపాదించగలిగాం. వచ్చే ఐదేళ్లలో రూ.35వేల కోట్లు దండుకోవాలనేది మోడీ టార్గెట్.