new corona cases : కొత్త కరోనా కేసుల్లో ప్రపంచంలోనే మొదటిస్థానంలో భారత్

భారత్‌లో కరోనా కేసుల దూకుడు కొనసాగుతోంది. రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసులు టెన్షన్ పెడుతున్నాయి.

new corona cases : కొత్త కరోనా కేసుల్లో ప్రపంచంలోనే మొదటిస్థానంలో భారత్

New Corona Cases

India ranks first in the world in new corona cases : భారత్‌లో కరోనా కేసుల దూకుడు కొనసాగుతోంది. రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసులు టెన్షన్ పెడుతున్నాయి. తాజాగా 24 గంటల్లో 89వేలకు పైగా కేసులు రికార్డయ్యాయి. 89వేల 129మంది వైరస్ బారిన పడినట్లు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. ఇక 7వందల మందిని వైరస్‌ బలితీసుకుంది. ప్రపంచంలో అత్యధిక కేసులు నమోదవుతున్న అమెరికా, బ్రెజిల్‌ను భారత్‌ వెనక్కు నెట్టింది. ఈ రెండు దేశాల్లో 24గంటల్లో 69వేలకు పైగా కేసులు వస్తే మన దగ్గర ఏకంగా 89వేల మంది దీనిబారిన పడ్డారు.

ఈ రెండు దేశాలతో పోల్చితే భారత్‌లో మరణాల సంఖ్య కాస్త తక్కువగా ఉన్నా కేసుల సంఖ్య శరవేగంగా పెరగడం టెన్షన్ పెడుతోంది. 80వేల కేసులు దాటడం ఇది వరుసగా రెండో రోజు. నిన్న కూడా 81వేలకు పైగా కేసులు వచ్చాయి. ఏప్రిల్1న 72వేలు, మార్చి 31న 53వేలకు పైగా ఈ వైరస్ బారిన పడ్డారు. దేసంలో కరోనా యాక్టివ్‌ కేసుల సంఖ్య ఆరున్నర లక్షలు దాటింది.

దేశంలో మహారాష్ట్ర కేసుల్లో దూసుకుపోతోంది. 24గంటల్లోనే 47వేల 827 కేసులు వచ్చాయి. బ్రెజిల్‌, అమెరికాల తర్వాత మిగిలిన అన్ని దేశాల కంటే మహారాష్ట్రలోనే ఎక్కువ కేసులు వస్తున్నాయి. చత్తీస్‌గఢ్‌, పంజాబ్‌, మధ్యప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఢిల్లీల్లోనూ కేసుల తీవ్రత ఎక్కువగానే కనిపిస్తోంది. కర్ణాటకలో సుమారు 5వేల మంది దీని బారిన పడ్డారు. ఛత్తీస్‌గఢ్‌లో 4వేలు దాటగా… తమిళనాడు, ఢిల్లీల్లో మూడువేలకు పైగా కేసులు వస్తున్నాయి.

దేశంలో కరోనా సెకండ్‌వేవ్‌ మార్చిలో ప్రారంభమైనట్లు గుర్తించారు. సైంటిస్టుల అంచనాల ప్రకారం ఈనెల రెండో వారంలో కేసుల సంఖ్య గరిష్ఠస్థాయిని చేరుకుంటుంది. అంటే రోజుకు కేసుల సంఖ్య లక్ష దాటిపోవచ్చు. తొలిదశలో కూడా ఎప్పుడూ ఇన్ని కేసులు రాలేదు. మే చివరిదాకా కరోనా ఉధృతి సాగి ఆ తర్వాత కాస్త తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. మహారాష్ట్ర తర్వాత పంజాబ్‌లో కేసుల తీవ్రత పెరగొచ్చని చెబుతున్నారు. దేశంలో కరోనా మొదటి దశ కేసుల సమయంలో అవలంభించిన సూత్రా అనే పద్ధతి ద్వారా దీన్ని లెక్కగట్టారు.