UN Security Council : యూఎన్ భద్రతా మండలి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన భారత్

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి(UNSC)అధ్యక్ష బాధ్యతలను ఆగస్టు నెలకు గాను భారత్‌ కు అప్పగించారు.

UN Security Council : యూఎన్ భద్రతా మండలి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన భారత్

Un

UN Security Council ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి(UNSC)అధ్యక్ష బాధ్యతలను ఆగస్టు నెలకు గాను భారత్‌ కు అప్పగించారు. ఐక్యరాజ్యసమతిలో భారత శాశ్వత రాయబారి తిరుమూర్తి ఆదివారం(ఆగస్టు-1,2021)UNSC అధ్యక్ష బాధ్యతలను స్వీకరించారు.

యూఎన్ భద్రతా మండలిలో నెలకొక దేశం(శాశ్వత,తాత్కాలిక సభ్య దేశాలు)అధ్యక్ష బాధ్యతలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఆదివారం(ఆగస్టు-1,2021)జులై నెలలో అధ్యక్ష బాధ్యతలను నిర్వహించిన ఫ్రాన్స్‌ నుంచి ఈ బాధ్యతలను భారత్​ స్వీకరించింది. UNSCకి భారత్​ అధ్యక్షత వహించడాన్ని ఫ్రాన్స్​, రష్యా సహా పలు సభ్య దేశాలు స్వాగతించాయి.

ఈ ఏడాది జనవరి నుంచి ఐరాస భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యదేశంగా భారత్​ తన ప్రయాణాన్ని ప్రారంభించింది. అప్పటి నుంచి ప్రపంచ శాంతికి భంగం కలిగించే ఎన్నో అంశాలను శాంతియుతంగా పరిష్కరించడంలో కీలక పాత్ర పోషిస్తూ వస్తోంది. భద్రతా మండలిలో 2021-22 కాలపరిమితిలో తాత్కాలిక సభ్యదేశంగా ఉన్న భారత్​…UNSC అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం ఇదే మొదటిసారి. అయితే,వచ్చే ఏడాది డిసెంబర్‌ లోనూ భారత్‌ మరోమారు UNSCకి అధ్యక్షత వహించనుంది.

ఈ సందర్భంగా UNSC అధ్యక్షడు తిరుమూర్తి మాట్లాడుతూ..చారిత్రక, సన్నిహత సంబంధాలను భారత్​, ఫ్రాన్స్​ కలిగి ఉన్నాయి. భద్రతా మండలిలో భారత్​కు సహకారం అందించినందుకు ఆ దేశానికి కృతజ్ఞతలు. భారత్​ తన అధ్యక్ష హయాంలో…సముద్ర తీర భద్రతకు, శాంతి పరిరక్షణకు, ఉగ్రవాదానికి వ్యతిరేకంగామూడు ఉన్నత స్థాయి సమావేశాలను నిర్వహించనున్నట్లు తిరుమూర్తి తెలిపారు. ఆయా అంశాలపై ఈ నెలలోనే సంతకాల సేకరణ చేపడుతామని ప్రకటించారు. సభ్య దేశాలతో భారత్‌ సమన్వయంతో పని చేస్తుందని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ ప్రకటించారు.

UNSC భారత్ అధ్యక్ష కాలంలో ఓ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షత వహించనున్నారని ఐక్యరాజ్య సమితికి భారత మాజీ రాయబారి సయ్యద్​ అక్బరుద్దీన్​ తెలిపారు. ఇలా యూఎన్​ఎసీలో సమావేశం నిర్వహించనున్న తొలి భారత ప్రధాని మోదీనేనని ఆయన తెలిపారు.