మిలటరీ క్యాంటీన్లలో విదేశీ వస్తువులు బ్యాన్…

  • Published By: nagamani ,Published On : October 24, 2020 / 12:42 PM IST
మిలటరీ క్యాంటీన్లలో విదేశీ వస్తువులు బ్యాన్…

india Ban on foreign brands in military canteens : భారతదేశంలోని మిలటరీ క్యాంటీన్లలో ఇకనుంచి విదేశీ బ్రాండ్ వస్తువులు కనిపించవు. భారత రక్షణ మంత్రిత్వ శాఖ తీసుకున్న ఈ కీలక నిర్ణయంతో దేశంలోని మిలటరీ క్యాంటీన్లలో విదేశీ బ్రాండ్ వస్తువులు ఇకపై కనిపించవు. భారత దేశ వ్యాప్తంగా ప్రస్తుతం 4 వేల మిలటరీ క్యాంటీన్లు ఉండగా..వాటిలో విదేశీ మద్యంతోపాటు ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా విక్రయిస్తున్నారు. కానీ ఇకపై అవి అందుబాటులో ఉండవు.


ప్రధాని నరేంద్రమోదీ స్వదేశీ వస్తువుల విక్రయం నినాదానికి మద్దతుగా మిలటరీ ఈ నిర్ణయం తీసుకుంది. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ అధికారులతో నిన్న శుక్రవారం (అక్టోబర్ 23,2020) జరిగిన సమావేశంలో ఈ నిర్ణయానికి వచ్చినట్టు రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.


ఇకపై విదేశాల నుంచి వస్తువులను దిగుమతి చేసుకోరాదని రక్షణ శాఖ జారీ చేసిన అంతర్గత ఉత్తర్వుల్లో పేర్కొంది. చైనాతో భారత్ కు గత కొంతకాలంలో తలెత్తిన ఘర్షణల నేపథ్యంలో చైనా వస్తువుల దిగుమతులపై ఇప్పటికే కేంద్రం పలు రకాల ఆంక్షలు విధించింది.
https://10tv.in/india-bans-import-of-acs-with-refrigerants-from-china/


తాజాగా..ఇప్పుడు మిలటరీ క్యాంటీన్లలో విదేశీ వస్తువుల్ని విక్రయించకూడదని…విదేశాల నుంచి వచ్చే మద్యం,ఎలక్ట్రానిక్ వస్తువులపై నిషేదం ప్రకటించారు.