Indian Oil: శ్రీలంక సంక్షోభం నుంచి బయటపడేసేందుకు ఇండియన్ ఆయిల్

దాదాపు 40వేల మెట్రిక్ టన్నుల పెట్రోల్, డీజిల్ ను కొనుగోలు చేయనుంది శ్రీలంక. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నుంచి కొనుగోలు చేయనున్నట్లు మంగళవారం కేబినెట్ నోట్ లో పేర్కొన్నారు.

Indian Oil: శ్రీలంక సంక్షోభం నుంచి బయటపడేసేందుకు ఇండియన్ ఆయిల్

Indian Oil

Indian Oil: దాదాపు 40వేల మెట్రిక్ టన్నుల పెట్రోల్, డీజిల్ ను కొనుగోలు చేయనుంది శ్రీలంక. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నుంచి కొనుగోలు చేయనున్నట్లు మంగళవారం కేబినెట్ నోట్ లో పేర్కొన్నారు. శ్రీలంక ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఇందన, శక్తి సంక్షోభమే ఇందుకు కారణం.

పవర్ మినిష్టర్ గామినీ లోకుగే శ్రీలంక ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తో చర్చలు జరుపుతుందని కొద్ది వారాల క్రితమే వెల్లడించారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ శ్రీలంకలో 2002 నుంచి ఆపరేషన్ లో ఉంది. కేబినెట్ స్టేట్మెంట్ ప్రకారం.. ఐఓసీతో చర్చలు జరిపి 40వేల మెట్రిక్ టన్నుల డీజిల్, 40వేల మెట్రిక్ టన్నుల పెట్రోల్ ను పంపించనున్నారు. ఈ సప్లై ఒప్పందానికి ఐఓసీ అంగీకారాన్ని తెలిపింది.

కొద్ది వారాలుగా నెలకొన్న సంక్షోభానికి ఫ్యూయెల్ పంపులు ఎండిపోక ముందే అలర్ట్ అయింది లంక ప్రభుత్వం. ఎనర్జీ మినిష్టర్ ఉదయ గమ్మన్పిల్లా స్థానిక ఐఓసీతో మాట్లాడి అక్కడ ఫ్యూయెల్ ను తెప్పించాలని కోరారు. దిగుమతులకు చెల్లించేందుకు సరిపడా కరెన్సీ లేకపోయినా ఒప్పందానికి సమ్మతించింది ఐఓసీ.

Read Also: ఐపీఎల్ వేలంలో ప్లేయర్‌గా బెంగాల్ క్రీడా మంత్రి