అమెరికాలో తెలుగు విద్యార్థుల అరెస్ట్

  • Published By: venkaiahnaidu ,Published On : January 31, 2019 / 03:52 AM IST
అమెరికాలో తెలుగు విద్యార్థుల అరెస్ట్

అమెరికాలో ఇమ్మిగ్రేషన్ మోసాలు వెలుగులోకి వచ్చాయి.  చట్టవిరుద్దంగా ఉంటున్నవారిపై అమెరికా కొరడా  ఝులిపించింది. ట్రంప్ ఆదేశాలతో పోలీసులు రంగంలోకి దిగారు. మిచిగాన్ లోని యూనివర్శిటీ ఆఫ్ ఫార్మింగ్ టన్ ని ఫేక్ యూనివర్శిటీగా అమెరికా భద్రతా బలగాలు గుర్తించారు. చదువు పేరుతో అమెరికా వెళ్లి ఉద్యోగాలు చేస్తున్న  600 మందిని పోలీసులు నిర్భంధించారు.విద్యార్థులను యూనివర్శిటీ లో  చేర్చేందుకు సహకరించిన మధ్యవర్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.

 

యూనివర్శిటీలో 99శాతం మంది తెలుగు విద్యార్థులే ఉండటం ఆందోళనకు గురిచేస్తోంది. ఇమ్మిగ్రేషన్ మోసాలకు పాల్పడిన 8మంది తెలుగు విద్యార్థులు..సామ సంతోష్ రెడ్డి, తక్కళ్లపల్లి అవినాష్, ఫణిదీప్, కాకారెడ్డి భరత్, సురేశ్ రెడ్డి కందాల, రాంపీస ప్రేమ్ కుమార్, నవీన్ పత్తిపాటి, అశ్వంత్ నూనె లను అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. డెట్రాయిట్ లో ఆరుగురు, ఫ్లోరిడా, వర్జీనియాలో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు విచారణ జరుపుతున్నారు.

 

విద్యార్థులను బయటకి తీసుకొచ్చేందుకు తానా ప్రయత్నిస్తోందని తానా అధ్యక్షుడు సతీష్ వేమన తెలిపారు. విద్యార్థుల కోసం తానా తరపున లాయర్లను అపాయింట్ చేస్తున్నట్లు తెలిపారు. గతంలో కూడా ఫేక్ యూనివర్శిటీల గుట్టు రయ్యాయి కానీ ఇంతపెద్ద ఎత్తున ఇదే మొదటిసారి అని తెలిపారు

See also : అరెస్ట్ అయిన తెలుగు స్టూడెంట్స్ ఏం తప్పు చేశారు

                  ఇండియన్ స్టూడెంట్స్ ఇలా మోసపోయారు