Cyber ​​Attacks on Bharat Hospitals : భవిష్యత్ యుద్ధాలన్నీ.. హైబ్రిడ్ వార్‌ఫేర్ రూపంలోనేనా? భారత్ ఆస్పత్రులపై సైబర్ ఎటాక్స్‌పై పలు అనుమానాలు..

ఐసీఎంఆర్‌పై జరిగిన సైబర్ ఎటాక్స్ వెనుక.. హాంకాంగ్ హ్యాకర్ల హస్తముందని తేలింది. దీంతో.. భారత్‌లోని అధికారిక వెబ్‌సైట్లతో పాటు ఆస్పత్రుల సర్వర్లపై జరుగుతున్న అన్ని సైబర్ దాడుల వెనుక.. చైనాయే ఉందనే అనుమానం వ్యక్తమవుతోంది. సరిహద్దుల్లో ఏమీ చేయలేక.. ఇలా సర్వర్ల మీద దాడులు చేస్తున్నారా? హ్యాకర్లు ఆస్పత్రులను ఎందుకు టార్గెట్ చేశారు? హైబ్రిడ్ వార్‌ఫేర్‌లో భాగంగానే.. చైనా ఇదంతా చేస్తోందా? సైబర్ ఎటాక్స్ వెనుక అంతుచిక్కని అనుమానాలెన్నో దాగున్నాయ్.

Cyber ​​Attacks on Bharat Hospitals : భవిష్యత్ యుద్ధాలన్నీ.. హైబ్రిడ్ వార్‌ఫేర్ రూపంలోనేనా? భారత్ ఆస్పత్రులపై సైబర్ ఎటాక్స్‌పై పలు అనుమానాలు..

Cyber ​​Attacks on Bharat Hospitals

Cyber ​​Attacks on Bharat Hospitals : ఐసీఎంఆర్‌పై జరిగిన సైబర్ ఎటాక్స్ వెనుక.. హాంకాంగ్ హ్యాకర్ల హస్తముందని తేలింది. దీంతో.. భారత్‌లోని అధికారిక వెబ్‌సైట్లతో పాటు ఆస్పత్రుల సర్వర్లపై జరుగుతున్న అన్ని సైబర్ దాడుల వెనుక.. చైనాయే ఉందనే అనుమానం వ్యక్తమవుతోంది. సరిహద్దుల్లో ఏమీ చేయలేక.. ఇలా సర్వర్ల మీద దాడులు చేస్తున్నారా? హ్యాకర్లు ఆస్పత్రులను ఎందుకు టార్గెట్ చేశారు? హైబ్రిడ్ వార్‌ఫేర్‌లో భాగంగానే.. చైనా ఇదంతా చేస్తోందా? సైబర్ ఎటాక్స్ వెనుక అంతుచిక్కని అనుమానాలెన్నో దాగున్నాయ్.

సరిహద్దుల్లో యుద్ధాలు కామన్. వైరస్‌లతో బయో వార్.. కొంచెం రిస్క్‌తో కూడుకున్నది. ఇప్పుడంతా.. హైబ్రిడ్ వార్ ఫేర్ జనరేషన్. కూర్చున్న చోటు నుంచే.. సైబర్ ఎటాక్స్‌తో.. కావాల్సిన సమాచారం దొంగిలించడం. అందుకనుగుణంగా వ్యూహాలు రచించడం. ఇప్పుడు చైనా చేస్తుంది కూడా ఇదే. భారత వ్యవస్థను పరీక్షించేందుకు చైనా సైబర్ ఎటాక్స్ చేయిస్తోందనే సమాచారం ఇప్పటికే ప్రభుత్వానికి అందింది. దీంతో.. ఈ కుట్రలను తిప్పికొట్టేందుకు.. నేషనల్ సైబర్ సెక్యూరిటీ, నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్.. ఢిల్లీలోని ఎయిమ్స్ సర్వర్లపై డ్రై రన్ చేస్తున్నారు. ఇప్పటికే హ్యాకర్ల బారిన పడిన సర్వర్లను వేరు చేశారు. ఎయిమ్స్ లాంటి ఆస్పత్రుల్లో వీవీఐపీలు, హైప్రొఫైల్ వ్యక్తులకు సంబంధించిన డేటా ఉంటుంది. అంతేకాదు.. రాష్ట్రపతి, ప్రధాని సహా.. దేశంలోని అత్యున్నత వ్యక్తుల వైద్య అవసరాలు తీర్చే ఆస్పత్రి ఎయిమ్స్ ఒక్కటే. అందువల్ల.. భవిష్యత్తులో తలెత్తబోయే సైబర్ వార్‌ఫేర్‌ను ఎదుర్కొనేందుకు వీలుగా.. పూర్తిస్థాయిలో సైబర్ సెక్యూరిటీ విభాగాన్ని సృష్టించాలనే సిఫారసులు కూడా వచ్చాయి. ఎయిమ్స్‌లో ప్రస్తుతమున్న ఫ్లాట్ కంప్యూటర్ ఆర్కిటెక్చర్ స్థానంలో.. రిడెండెన్సీతో కూడిన హైరార్కికల్ కంప్యూటర్ వ్యవస్థను ఉపయోగించాలని సూచించారు.

Cyber ​Aattack On AIIMS,ICMR Servers : భారత్‌లోని ఆస్పత్రులపై సైబర్ ఎటాక్స్ ..AIIMS,ICMR సర్వర్లపై హ్యాకర్ల దాడులు చైనా పనేనా?

భవిష్యత్ యుద్ధాలన్నీ.. హైబ్రిడ్ వార్‌ఫేర్ రూపంలోనే జరుగుతాయ్. అందులో సైబర్ ఎటాక్స్‌దే కీలకపాత్రగా ఉండబోతోంది. కాబట్టి.. అమెరికా, చైనా, రష్యా, ఫ్రాన్స్ లాంటి దేశాలు.. ఇప్పటికే తమ ప్రభుత్వ వెబ్‌సైట్లు, సర్వర్లు.. హ్యాకింగ్ బారిన పడకుండా.. సైబర్ ఎటాక్స్‌కి గురి కాకుండా.. సమర్థవంతమైన ఫైర్‌వాల్స్‌ని నిర్మించుకున్నాయి. ఈ దేశాల్లోని ప్రభుత్వ సర్వర్లన్నీ.. ఒకే పోర్టల్ నుంచి ఆపరేట్ చేసేందుకు అనుమతిస్తాయి. ఇదెంతో గొప్ప రక్షణ వ్యవస్థ అనే అభిప్రాయాలున్నాయి. అదే.. భారత్ విషయానికొస్తే.. మన సర్వర్లకు చైనాతో పాటు దాయాది పాకిస్థాన్‌తోనూ ముప్పు ఉంది. తూర్పు ఐరోపా, మధ్యప్రాచ్యంలోని దేశాల నుంచి పాకిస్థాన్.. ఇండియన్ సర్వర్లను హ్యాక్ చేసేందుకు ప్రయత్నిస్తోందని తెలిసింది.

అత్యాధునిక సేవల పేరు చెప్పి.. పేషెంట్ల నుంచి భారీగా ఫీజులు వసూలు చేసే కార్పొరేట్‌ ఆస్పత్రులు.. రోగుల డేటా భద్రత విషయంలో పెద్దగా జాగ్రత్తలు తీసుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. సొంతంగా సైబర్‌ సెక్యూరిటీ నిపుణులను నియమించుకోకుండా.. ముంబై, ఢిల్లీ కేంద్రంగా పనిచేసే థర్డ్‌ పార్టీ సైబర్‌ సెక్యూరిటీ సంస్థలతో పని కానిచ్చేస్తున్నాయ్. థర్డ్‌ పార్టీకి కాకుండా.. ఆస్పత్రులే సొంతంగా సైబర్‌ సెక్యూరిటీ నిపుణులను నియమించుకోవడం ఒక్కటే సమస్యకు పరిష్కారమని నిపుణులు చెబుతున్నారు. నిజానికి.. అగ్రదేశాల్లో ఒక వ్యక్తి ప్రైవసీకి భంగం కలిగినా, డేటా లీక్‌ అయినా తీవ్ర చర్యలుంటాయి. భారత్‌లో మాత్రం అలాంటివేవీ లేవు. అందువల్ల.. శక్తిమంతమైన డేటా ప్రొటెక్షన్‌ చట్టాలు రావాల్సి ఉందని నిపుణులు చెబుతున్నారు. డార్క్‌వెబ్‌ను, వీపీఎన్‌ను నియంత్రించే చర్యలు ఇప్పటికీ మన దేశంలో లేవు.

China Spy Ship ‘Yuan Wang 5’ : హిందూ మహాసముద్రంలో చైనా గూఢచార నౌక కలకలం .. భారత్‌పైనే కన్ను

పక్కన ఉన్న చైనా.. గ్రేట్ ఫైర్‌వాల్‌ ఆఫ్‌ చైనా పేరుతో ఆ చర్యలు తీసుకుంటోంది. డార్క్‌వెబ్‌ కట్టడికి అమెరికాలోని ఎఫ్‌బీఐ, డచ్‌ పోలీసు, యూరో పోలీసు విభాగాలు పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నాయి. ఎప్పటికప్పుడు డార్క్‌నెట్‌ వెబ్‌సైట్లను తొలగిస్తున్నాయి. మన దేశంలోనూ అలాంటి వ్యవస్థలు రావాల్సి ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. ఎందుకంటే.. ఎయిమ్స్ లాంటి ఆస్పత్రుల్లో హైఫ్రొఫైల్ వ్యక్తులు చికిత్స పొందుతారు. ఐసీఎంఆర్ లాంటి సంస్థలో ఎన్నో రకాల వైద్య పరిశోధనలు జరుగుతుంటాయ్. వాటన్నింటి వివరాలు.. వెబ్‌సైట్లలోనే నిక్షిప్తమై ఉంటుంది. అందువల్ల.. ఆ డేటా లీక్ అయితే ఊహించని ప్రమాదాలను ఎదుర్కోవాల్సి వస్తుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.