Rajma Chawal Tattoo: చేతిపై రాజ్మా చావల్ టాటూ.. నెటిజన్ల రియాక్షన్ ఏంటో తెలుసా?
ఒక వ్యక్తి తనకిష్టమైన ఫుడ్ పేరును టాటూగా వేయించుకున్నాడు. ఒక యువకుడు తనకిష్టమైన రాజ్మా చావల్ పేరును మోచేతి పైభాగంలో, వెనుకవైపు టాటూగా వేయించుకున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోను ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ ట్వీట్ చేసింది. అతడి పేరు, వివరాల్ని మాత్రం స్విగ్గీ వెల్లడించలేదు

Rajma Chawal Tattoo: సాధారణంగా ఎవరైనా కుటుంబ సభ్యులు, ఇష్టమైన వ్యక్తుల పేర్లు, డిఫరెంట్ డిజైన్స్‌ను ఒంటిపై టాటూలా వేయించుకుంటారు. కానీ, ఒక వ్యక్తి మాత్రం తనకిష్టమైన ఫుడ్ పేరును టాటూగా వేయించుకున్నాడు. ఒక యువకుడు తనకిష్టమైన రాజ్మా చావల్ పేరును మోచేతి పైభాగంలో, వెనుకవైపు టాటూగా వేయించుకున్నాడు.
Google Bard: ‘చాట్‌జీపీటీ’కి పోటీగా గూగుల్ ‘బార్డ్’.. బ్లాగ్ ద్వారా వెల్లడించిన సుందర్ పిచాయ్
దీనికి సంబంధించిన ఫొటోను ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ ట్వీట్ చేసింది. అతడి పేరు, వివరాల్ని మాత్రం స్విగ్గీ వెల్లడించలేదు. దీనికి సంబంధించిన ట్వీట్ ఇప్పుడు నెటిజన్లు ఆకర్షిస్తోంది. ప్రతి ఒక్కరికీ ఏదో ఒక ఫేవరెట్ ఫుడ్ ఉంటుంది. ఇష్టమైన ఫుడ్ అయితే, ఎక్కువగా తింటాం. కానీ, ఆ యువకుడు మాత్రం తన ఒంటిపై శాశ్వాతంగా నిలిచిపోయేలా, టాటూగా వేయించుకోవడం విశేషం. రాజ్మా చావల్.. నార్త్ ఇండియాన్స్ ఇష్టంగా తినే శాకాహారం. చాలా మందికి ఇది ఫేవరెట్ ఫుడ్. రోజూ ఇదే పెట్టినా, కొందరు వద్దనకుండా తినేస్తారు. అంతలా నచ్చింది కాబట్టే.. అతడు ఆ పేరును పచ్చబొట్టు వేయించుకున్నాడు. స్విగ్గీ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది.
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీఏ గోరంట్ల బుచ్చిబాబును అరెస్టు చేసిన సీబీఐ
ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు తాము కూడా తమ ఫేవరెట్ ఫుడ్ ఐటమ్ పేరును టాటూగా వేయించుకోవాలి అనుకుంటున్నారు. ఇందుకోసం తమ ఫేవరెట్ ఫుడ్ ఏదో ట్వీట్ చేస్తున్నారు. తాము ఇష్టమైన ఆహారం పేరును టాటూగా వేయించుకోవాల్సి వస్తే కొందరు చోలాభటూరే అని, ఇంకొందరు గులాబ్ జామూన్ అని, మరికొందరు వడపావ్, పావ్ భాజీ, దమ్ ఆలూ.. అంటూ రకరకాల పేర్లు చెబుతున్నారు.
ever loved something so much you want it to stay with you forever pic.twitter.com/DP9nTdUSNR
— Swiggy (@Swiggy) February 5, 2023