Gold Taxes : బంగారంపై పెట్టుబడి పెడుతున్నారా? ఎన్ని రకాల పన్నులు ఉన్నాయి, ఎంత ట్యాక్స్ కట్టాలో తెలుసుకోండి..

వ్యక్తులు తమ ఆర్థిక లక్ష్యాలను బట్టి వివిధ రకాల బంగారాల్లో ఇన్వెస్ట్ చేస్తారు. అయితే, బంగారంపై పలు రకాల పన్నులు వేస్తారని మీకు తెలుసా? ఎంత పన్ను కట్టాలో తెలుసా?

Gold Taxes : బంగారంపై పెట్టుబడి పెడుతున్నారా? ఎన్ని రకాల పన్నులు ఉన్నాయి, ఎంత ట్యాక్స్ కట్టాలో తెలుసుకోండి..

Gold Taxes

Gold Taxes : భారతీయులకు బంగారం అంటే ఎంతో మక్కువ. మరీ ముఖ్యంగా మగువలకు. గోల్డ్ అంటే ప్రాణం. అకేషన్ ఏదైనా వచ్చిందంటే చాలు పసిడి కొనేందుకు రెడీ అయిపోతారు. ఇక పెళ్లిళ్లు, పండుగలు వచ్చాయంటే కచ్చితంగా గోల్డ్ కొనాల్సిందే. ఇలా పుత్తడితో భారతీయులకు విడదీయలేని బంధం ఉంది. ఇకపోతే మన దేశంలో చాలామంది బంగారాన్ని ఒక ఆభరణంగానే కాదు దాన్ని ఒక సురక్షితమైన పెట్టుబడిగానూ చూస్తారు.

పెట్టుబ‌డిదారులు బంగారాన్ని స్వ‌ర్గ‌ధామంగా భావించి ప‌సిడికి మ‌రింత ప్రాధాన్య‌త ఇస్తున్నారు. అయితే, ఈ మధ్య బంగారంలో పెట్టుబడి పెట్టడానికి అనేక కొత్త మార్గాలు వచ్చాయి. డిజిటల్ బంగారం, భౌతిక బంగారం, పేప‌ర్ బంగారం వంటివి ప్రస్తుత కాలంలో అందుబాటులో ఉన్న కొన్ని బంగారు పెట్టుబడుల రకాలు. ఇప్పుడు పెట్టుబడిదారులు కేవలం భౌతిక బంగారం మీదనే కాకుండా మిగతా వాటి మీద కూడా పెట్టుబడులు పెడుతున్నారు.

బంగారం పెట్టుబడుల రకాలు:
భౌతిక బంగారం(ఫిజికల్ గోల్డ్): బంగారు ఆభరణాలు, నాణేలు, బార్లు మొదలైనవి
డిజిటల్ బంగారం(డిజిటల్ గోల్డ్): పేటిఎమ్, గూగుల్ పే వంటి మొబైల్ వాలెట్ల ద్వారా కొనుగోలు చేసే బంగారం
పేప‌ర్ బంగారం(పేపర్ గోల్డ్): గోల్డ్ బాండ్లు, గోల్డ్ ఈటీఎఫ్ లు, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ మొదలైనవి

Lukewarm Water : పరగడుపున గోరు వెచ్చని నీళ్ళు తాగితే ప్రయోజనాలు ఎన్నంటే?

వ్యక్తులు తమ ఆర్థిక లక్ష్యాలను బట్టి పలు రకాల బంగారాల్లో ఇన్వెస్ట్ చేస్తారు. అయితే, వివిధ రకాల ఇన్వెస్ట్ మెంట్లపై పలు రకాల పన్నులు విధించబడతాయని మీకు తెలుసా? భౌతిక బంగారంపైనా, గోల్డ్ బాండ్ల‌పైనా ఒకే ర‌కంగా ప‌న్ను ఉండ‌దని తెలుసా? అందుకే పెట్టుబడి పెట్టడానికి ముందు వివిధ బంగారు పెట్టుబడుల పన్నుల గురించి తెలుసుకోవడం అవసరం అంటున్నారు నిపుణులు.

ఫిజికల్ గోల్డ్
ఆభరణాలు లేదా నాణేలు వంటి భౌతిక బంగారంపై పన్ను విధించడం అనేది మీరు వాటిని ఎంతకాలం ఉంచుకున్నారనే దానిపై ఆధారపడి ఉంటుంది. భౌతిక బంగారు పెట్టుబడి మూలధన లాభాలపై దీర్ఘకాలం, స్వల్పకాలిక వ్యవధిని బట్టి పన్ను ఉంటుంది. మీరు బంగారాన్ని కొనుగోలు చేసిన మూడేళ్లలోపు విక్రయిస్తే, మీరు స్వల్పకాలిక మూలధన లాభాలపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే మీరు మూడేళ్ల తర్వాత విక్రయిస్తే మీరు దీర్ఘకాలిక మూలధన లాభాలపై పన్ను పడుతుంది. స్వల్పకాలిక మూలధన లాభాలను మొత్తం పన్ను పరిధిలోకి తీసుకున్నప్పుడు మొత్తం ఆదాయంపై ఆదాయపు పన్ను స్లాబ్ రేటు ప్రకారం ట్యాక్స్ విధిస్తారు.

Gerbera Farming: ఒక్కసారి నాటితే మూడేళ్ల వరకూ ఆదాయం.. జెర్బరా ప్రత్యేకత అదే

అదే దీర్ఘకాలిక మూలధన లాభం(ఎల్‌టిసిజి)పై 20శాతం + 4శాతం సెస్ ప‌న్ను, అదనంగా సర్‌ఛార్జ్ వర్తిస్తే పన్ను విధిస్తారు. అలాగే మీరు ఆభరణాల విషయంలో భౌతిక బంగారం కొనుగోలు సమయంలో మేకింగ్ ఛార్జీలపై 3% జీఎస్టీని చెల్లించాల్సి ఉంటుంది. భౌతిక బంగారాన్ని విక్రయించేటప్పుడు టీడీస్ వర్తించదు. కానీ, మీరు రూ.2 లక్షలకు పైగా బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తే 1% టీడీస్ వర్తిస్తుంది.

డిజిటల్ గోల్డ్..
డిజిటల్ బంగారంపై కూడా భౌతిక బంగారంతో సమానమైన పన్ను రేటు విధిస్తారు. అలాగే, పన్ను అనేది మీ పెట్టుబడి కాలవ్యవధిపై ఆధారపడి ఉంటుంది. మూడేళ్ల తర్వాత విక్ర‌యిస్తే ఎల్‌టీసిజిగా ప‌రిగణించి 20శాతం ప‌న్ను+సెస్‌, స‌ర్‌చార్జ్‌లు విధిస్తారు. అయితే డిజిట‌ల్ గోల్డ్‌లో స్వ‌ల్ప‌కాల రాబ‌డిపై డైరెక్ట్‌గా ట్యాక్స్ విధించరు. అయితే, మూడేళ్లలోపు విక్రయిస్తే ఎటువంటి పన్ను ఉండదు. డిజిటల్ బంగారంపై పెట్టుబడులు అనేది చాలా తక్కువ మొత్తం నుంచి ప్రారంభించవచ్చు. అందుకే ఇది పెట్టుబడిదారులలో ఎక్కువగా ప్రాచుర్యం పొందుతోంది.

పేపర్ గోల్డ్..
గోల్డ్ ఈటీఎఫ్‌లు, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్, సార్వభౌమ బంగారు బాండ్లు(ఎస్‌జీబి) పేపర్ గోల్డ్ కిందకొస్తాయి. వీటిలో బంగారు ఈటీఎఫ్‌లు, బంగారు మ్యూచువల్ ఫండ్స్ పై భౌతిక బంగారంతో పాటు సమానంగా పన్ను ఉంటుంది. అయితే, ఎస్‌జీబిలపై పన్నులు కొంచెం భిన్నంగా ఉంటాయి. గోల్డ్ ఈటీఎఫ్‌లు, మ్యూచువల్ ఫండ్స్ మూడేళ్లకు పైగా మీ దగ్గర ఉన్నప్పుడు ఎల్‌టిసిజి వర్తిస్తుంది. రేటు కూడా ఒకేవిధంగా ఉంటుంది. మూడేళ్ల కంటే తక్కువ ఉంటే ఆ పెట్టుబడుల లాభాలను మీ పన్ను పరిధిలోకి తెచ్చి ఐటీ స్లాబ్ ప్రకారం ట్యాక్స్ విధిస్తారు.

ఒక ఎస్‌జీబిపై ఏడాదికి 2.5% వడ్డీ లభిస్తుంది. అందుకని దీనిని మీ పన్ను పరిధిలోకి తెచ్చి మీ ప్రధాన ఆదాయంపై ఐటీ స్లాబ్ ప్రకారం పన్ను విధిస్తారు. అయితే, 8ఏళ్ల తర్వాత ఎస్‌జీబిల ద్వారా మీరు పొందే ఏవైనా లాభాలు పన్ను రహితం. ఎస్‌జీబిలకు ఐదేళ్ల లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది, అయితే, ముందస్తుగా ఉపసంహరించుకున్నట్లయితే, విభిన్న పన్ను రేట్లు వర్తిస్తాయి. ఐదేళ్ల త‌రువాత ఎనిమిదేళ్ల‌కు ముందు విత్‌డ్రా చేసుకుంటే ఎల్‌టీసిజి ప‌న్ను 20శాతం+4శాతం సెస్ వ‌ర్తిస్తుంది.

గోల్డ్ డెరివేటీవ్‌
గోల్డ్ డెరివేటీవ్‌లపై వ‌ర్తించే ప‌న్ను భిన్నంగా ఉంటుంది. గోల్డ్ డెరివేటీల నుంచి వ‌చ్చే రాబ‌డిని వ్యాపారంపై వ‌చ్చే ఆదాయంగా క్లెయిమ్ చేసుకోవచ్చు. సంస్థ మొత్తం ట‌ర్నోవ‌ర్ రూ. 2 కోట్ల కంటే త‌క్కువ ఉంటే 6 శాతం ప‌న్ను విధిస్తారు. ఇది ఆయా సంస్థ‌ల‌కు ప‌న్ను భారాన్ని త‌గ్గిస్తుంది. అయితే, టర్నోవర్ రూ.2 కోట్లకు పైగా ఉంటే దానిని వ్యాపార ఆదాయంగా చేర్చలేము.

బహుమతి బంగారంపై ట్యాక్స్..
తల్లిదండ్రులు, తోబుట్టువులు లేదా పిల్లల నుంచి బంగారం బహుమతిగా అందుకున్నట్లయితే, అది పన్ను రహితం. కానీ, మీరు వారి నుంచి కాకుండా ఎవరైనా బహుమతిగా పొందితే మొత్తం బహుమతి విలువ రూ.50వేలకు చేరుకుంటే ఐటి స్లాబ్ ప్రకారం పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. ఎవరి నుంచి అయినా రూ.50వేల కంటే తక్కువ బహుమతిగా బంగారం పొందితే అది పన్ను రహితం. అయితే, బంగారాన్ని విక్రయించేటప్పుడు భౌతిక బంగారంతో సమానమైన పన్ను రేటు విధిస్తారు.