Supreme Court: అలాంటి ఆవాల విడుదల వెనుక బలమైన కారణం ఏమైనా ఉందా? కేంద్రానికి సుప్రీంకోర్టు ప్రశ్న

దేశంలో జన్యుమార్పిడి పంటలు విడుదల చేయడంపై కేంద్రాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. జన్యుమార్పిడి పంటలను దేశంలో నిషేధించాలని కోరుతూ దాఖలైన ఒక పిటిషన్‌ను కోర్టు విచారించింది.

Supreme Court: అలాంటి ఆవాల విడుదల వెనుక బలమైన కారణం ఏమైనా ఉందా? కేంద్రానికి సుప్రీంకోర్టు ప్రశ్న

Supreme Court: జన్యు మార్పిడి చేసిన ఆవాలను దేశంలో విడుదల చేయడానికి ప్రత్యేకమైన కారణం ఏదైనా ఉందా అని కేంద్రాన్ని ప్రశ్నించింది సుప్రీంకోర్టు. జన్యు మార్పిడి ఆవాలైన హైబ్రిడ్ డీఎంహెచ్-11 రకం ఆవాలను విడుదల చేయడంపై కేంద్రాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.

Maharashtra: బాలికపై పదిహేనేళ్ల బాలుడి హత్యాచారం.. బాలిక తండ్రిపై ప్రతీకారం తీర్చుకునేందుకు దారుణం

ఈ ఆవాలను సెంటర్ ఫర్ జెనెటిక్ మ్యానిప్యులేషన్ ఆఫ్ క్రాప్ ప్లాంట్స్ సంస్థ అభివృద్ధి చేసింది. కాగా, దేశంలో జన్యుమార్పిడి పంటలు, విత్తనాలపై నిషేధం విధించాలని కోరుతూ ప్రముఖ సామాజిక కార్యకర్త అరుణా రోడ్రిగ్స్, ‘జీన్ క్యాంపెయిన్’ అనే స్వచ్ఛంద సంస్థ వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం విచారణ జరిపింది. జస్టిస్ దినేష్ మహేశ్వరి, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. ఈ సందర్భంగా.. మన దేశంలో జన్యుమార్పిడి విత్తనాల గురించి రైతులకు అంతగా అవగాహన లేదనే విషయాన్ని కోర్టు గుర్తు చేసింది. జన్యుమార్పిడి విత్తనాలతో అనేక రకాల దుష్ప్రభావాలు ఉంటాయన్న ప్రచారం జరుగుతోందని తెలిపింది. ఈ కేసులో కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ ఆర్.వెంకట రమణి వాదించారు.

IPL Auction: డిసెంబర్ 23న ఐపీఎల్ మినీ వేలం.. పోటీలో 991 మంది ఆటగాళ్లు.. ఆస్ట్రేలియా ప్లేయర్సే టాప్

జన్యుమార్పిడి పంటలను కొందరు సామాజిక కార్యకర్తలు, కొందరు నిపుణులు మాత్రమే సిద్ధాంతపరమైన ఉద్దేశాలతో వ్యతిరేకిస్తున్నారని.. అంతేకానీ, శాస్త్రీయ అంశాల ఆధారంగా, హేతుబద్ధత కలిగిన కారణాలతో కాదని వెంకట రమణి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు కేసు విచారణను ఈ నెల 7వ తేదీకి వాయిదా వేసింది.