మానవత్వం చచ్చింది.. 18 హాస్పిటళ్లు తిరిగినా ప్రాణం దక్కలేదు

మానవత్వం చచ్చింది.. 18 హాస్పిటళ్లు తిరిగినా ప్రాణం దక్కలేదు

కొవిడ్ 19 లక్షణాలు కనిపిస్తుండటంతో ప్రాణాలు కాపాడుకునేందుకు 18 హాస్పిటళ్లు తిరిగినా ఉపయోగం లేకుండాపోయింది. 50ఏళ్లు నిండిన వ్యక్తికి ట్రీట్‌మెంట్ కావాలని తిరిగినా.. బెడ్ ల కొరత ఉందని చెప్పి నిరాకరించారు. బెంగళూరులోని నగరాత్‌పేట్‌కు చెందిన వ్యక్తి శ్వాసకు 24గంటలు సమస్యగా అనిపించింది.

అతని ఆరోగ్యం పూర్తిగా చెడిపోయింది. కొవిడ్ లక్షణాలతో బాధపడుతున్నాడు. ఒక అంబులెన్స్ బుక్ చేసుకున్నారు. చాలా హస్పిటళ్లు తిరిగారు. గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా చేర్చుకునేందుకు నిరాకరించారు. ఎవ్వరూ చేర్చుకోలేదు. శనివారం సాయంత్రం వరకూ మేం చేర్పించలేకపోయామని బంధువులు అన్నారు.

టెస్టులు చేస్తే అతను ఇంకా బలహీనపడిపోతాడని హాస్పిటల్ అధికారులు చెప్పడం షాకింగ్ గా అనిపించింది. ఒకవేళ అలా జరిగితే ఐసీయూలో చేర్పించాల్సి ఉంటుంది. కానీ, ఒక్క బెడ్ కూడా ఖాళీగా లేదు. ప్రైవేట్ హాస్పిటల్స్ అపోలో, ఫోర్టిస్, మణిపాల్ లాంటి ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా బెడ్, ఐసీయూల కొరత కారణంగా చేర్చుకోలేదు. ఓ 50 హాస్పిటల్స్ ఉంటే అందులో 18తిరిగినా ఉపయోగం లేకుండా పోయింది.

ఆదివారం ఉదయం 4గంటల 30నిమిషాల సమయంలో ఇంటికి వచ్చారు. ఇంటి వద్ద ఆక్సిజన్ సిలిండర్ ఏర్పాటు చేశారు. రాజాజీ నగర్లోని ప్రైవేట్ ల్యాబొరేటరీలో టెస్టులు చేయించేందుకు ప్రయత్నించారు. సోమవారం ఫలితాలు వచ్చాయి. ఆదివారం సాయంత్రానికే అతని ఆరోగ్యం క్షీణించింది. మరోసారి హాస్పిటల్ తీసుకెళ్దామనుకున్నా కుదరలేదు.

హాస్పిటల్స్ ముందు అడుక్కున్నాం. మానవత్వం చచ్చిపోయిందనిపించింది. అంబులెన్స్ డోర్ ఓపెన్ చేయడానికి కూడా మమ్మల్ని అనుమతించలేదు. వెంటిలేటర్ పెట్టిన 10నిమిషాల్లోనే ప్రాణాలు పోయింది.