No Confidence Motion: ఆవులు, గేదెల్ని కూడా లెక్కిస్తారు, మా లెక్కలు ఒద్దా? ఆర్ఎస్ఎస్ పేరు ప్రస్తావిస్తూ జేడీయూ నేత ఫైర్

బీహార్‌లోని నితీష్ కుమార్ ప్రభుత్వం కులగణనకు చేపట్టింది. అయితే దీనికి బీజేపీ మొకాలడ్డింది. కుల గణన చేయరాదని బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్‌లో పేర్కొంది

No Confidence Motion: ఆవులు, గేదెల్ని కూడా లెక్కిస్తారు, మా లెక్కలు ఒద్దా? ఆర్ఎస్ఎస్ పేరు ప్రస్తావిస్తూ జేడీయూ నేత ఫైర్

No Confidence Motion: దేశంలో ఆవులు, గేదెలు వంటి పశువులను కూడా లెక్కిస్తున్నవారు ఓబీసీల కులగణనపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నరంటూ కేంద్ర ప్రభుత్వంపై జనతాదళ్ యూనైటెడ్ పార్టీ నేత, ఎంపీ గిర్ధారి యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్‌ఎస్‌ఎస్ పేరును ప్రస్తావిస్తూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. బీజేపీని ఆర్ఎస్ఎస్ ఎజెండాపై నడుస్తున్న ప్రభుత్వమని అన్నారు.

Hawaii wildfire : హవాయి ద్వీపంలో కార్చిచ్చు…53 కు పెరిగిన మృతుల సంఖ్య, వెయ్యి భవనాలు దగ్ధం

‘‘బీజేపీ ప్రభుత్వం వెనుకబడిన వర్గాల వ్యతిరేక ప్రభుత్వం. ఇది ఆవుల గణన చేస్తుంది, గేదెల గణన చేస్తుంది. కానీ వెనుకబడిన తరగతుల జనాభా గణన చేయదు. బీజేపీ ప్రభుత్వం ఆర్‌ఎస్‌ఎస్‌ అజెండాతో నడుస్తోంది’’ అని గిర్ధారీ అన్నారు. అయితే గిర్ధారిని స్పీకర్ మందలించారు. ఆయన ప్రసంగాన్ని అడ్డుకుని, ‘‘మీరు ఆర్‌ఎస్‌ఎస్ పేరు ఎందుకు ప్రస్తావిస్తున్నారు? ఆర్ఎస్ పేరు తీసుకోవద్దు. రాజకీయ పార్టీని ఏదైనా అనండి. మిగతావారిపై ఆరోపణలు చేయవద్దు. కాకపోతే వారికి మీరేమైనా పొగడ్త ఇవ్వదలుచుకుంటే సరే.. కానీ ఇది అవమానకరమైన విషయం’’ అని అన్నారు.

Shamshabad : శంషాబాద్‌లో దారుణం.. పెట్రోల్ పోసి మహిళను హత్యచేసి దుండగులు

బీహార్‌లోని నితీష్ కుమార్ ప్రభుత్వం కులగణనకు చేపట్టింది. అయితే దీనికి బీజేపీ మొకాలడ్డింది. కుల గణన చేయరాదని బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్‌లో పేర్కొంది. ఓబీసీ కులాలను లెక్కించడం చాలా కష్టమైన పనని కేంద్రం పేర్కొంది. అదే సమయంలో బీహార్ ప్రభుత్వం 2023 జనవరిలో జనాభా గణనను నిర్వహించే పనిని ప్రారంభించింది. ఇది మేలో పూర్తి చేయవలసి ఉంది. కానీ కోర్టు అడ్డంకులతో మధ్యలోనే ఆగిపోయింది.