Reliance Jio: దేశవ్యాప్తంగా నిలిచిపోయిన జియో సేవలు.. ఇంటర్నెట్‌కు అంతరాయం

జియో బ్రాడ్‌బాండ్, ఇంటర్నెట్ సేవలు అందుబాటులో లేకపోవడంతో యూజర్లు ఇంటర్నెట్ కనెక్ట్ కాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ అంశంపై స్పందించిన కంపెనీ సేవల పునరుద్ధరణకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది.

Reliance Jio: దేశవ్యాప్తంగా నిలిచిపోయిన జియో సేవలు.. ఇంటర్నెట్‌కు అంతరాయం

Reliance Jio: దేశవ్యాప్తంగా రిలయన్స్ జియో సేవలు నిలిచిపోయాయి. బుధవారం ఉదయం నుంచి ఈ పరిస్థితి తలెత్తింది. జియో బ్రాడ్‌బాండ్, ఇంటర్నెట్ సేవలు అందుబాటులో లేకపోవడంతో యూజర్లు ఇంటర్నెట్ కనెక్ట్ కాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ అంశంపై స్పందించిన కంపెనీ సేవల పునరుద్ధరణకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది.

Police Recruitment: గర్భిణి అభ్యర్థులకు శుభవార్త.. ఫిజికల్ ఈవెంట్స్ లేకుండానే మెయిన్స్ పరీక్షకు అనుమతి

వీలైనంత త్వరగా సేవల్ని తిరిగి ప్రారంభిస్తామని కంపెనీ చెప్పింది. తమ సిబ్బంది సమస్యను పరిష్కరించేందుకు విశేషంగా కృషి చేస్తున్నట్లు చెప్పింది. ఉదయం నుంచి రిలయన్స్ జియో నెట్‌వర్క్, జియో బ్రాడ్‌బ్యాండ్, జియో 5జీ సేవలకు అంతరాయం కలుగుతోంది. అనేక చోట్ల వినియోగదారులు సిగ్నల్ సరిగ్గా లేక, కొన్ని చోట్ల అసలే సిగ్నల్ రాకుండా ఇబ్బంది పడుతున్నారు. అనేక చోట్ల కొత్తగా ప్రారంభమైన 5జీ సేవల్లో కూడా అంతరాయం కలుగుతోంది. వీటిపై యూజర్లు సంస్థకు ఫిర్యాదు చేస్తున్నారు. సర్వర్లలో సమస్య వల్ల ఈ పరిస్థితి తలెత్తి ఉండొచ్చని, మరికొన్ని గంటల్లోనే సమస్యను పరిష్కరిస్తామని జియో వర్గాలు తెలిపాయి.