Jitin Prasada: బీజేపీలోకి కాంగ్రెస్ అగ్రనేత

ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జితిన్ ప్రసాద్ బీజేపీలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు.

Jitin Prasada: బీజేపీలోకి కాంగ్రెస్ అగ్రనేత

Jitin Prasad

Jitin Prasad: ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సీనియర్ నేత, జితిన్ ప్రసాద ఢిల్లీలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈయన రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా గెలుపొందారు. యూపీఏ – 2 లో కేంద్ర మంత్రిగా పనిచేశారు.

జితిన్ ప్రసాద కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు. ఇక జితిన్ ప్రసాద బీజేపీలో చేరినట్లు అధికారికంగా ప్రకటించింది ఆ పార్టీ. కాగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కీలకనేతలైన జ్యోతిరాదిత్య సింధియా, హిమంత బిశ్వ శర్మ వంటి వారిని దూరం చేసుకుంది. తాజాగా జితిన్ ప్రసాద కూడా పార్టీని విడటంతో ఆ పార్టీ వర్గాల్లో నైరాశ్యం అలుముకుంది.