Single Dose Covid Vaccine : సింగిల్ డోస్ వ్యాక్సిన్ వచ్చేస్తోంది..అనుమతినివ్వాలన్న జాన్సన్ అండ్ జాన్సన్

కరోనా వ్యాక్సిన్ తయారులో జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ నిమగ్నమైన సంగతి తెలిసిందే. అమెరికాకు చెందిన ఈ సంస్థ...తాజాగా సింగిల్ డోస్ తయారు చేసింది. ‘జాన్సెన్’ పేరిట తయారు చేసిన ఈ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతినివ్వాలంటూ...శుక్రవారం దరఖాస్తు చేసుకుంది.

Single Dose Covid Vaccine : సింగిల్ డోస్ వ్యాక్సిన్ వచ్చేస్తోంది..అనుమతినివ్వాలన్న జాన్సన్ అండ్ జాన్సన్

Johnson

Johnson & Johnson : కరోనా వైరస్ ఇంకా తగ్గుముఖం పట్టడం లేదు. ప్రపంచంలోని పలు దేశాల్లో ఇంకా పాజిటివ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా జోరుగా కొనసాగుతోంది. పలు కంపెనీలు తయారు చేసిన వ్యాక్సిన్ లు ప్రజలకు అందిస్తున్నారు. కోవాగ్జిన్, కోవీషీల్డ్ టీకాలను అందిస్తోంది. అయితే..కొన్ని వ్యాక్సిన్ లు రెండు డోస్ లు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. తాజాగా…సింగిల్ డోస్ వ్యాక్సిన్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. ప్రభుత్వం అనుమతినిస్తే…అత్యవసర వినియోగానికి ఈ వ్యాక్సిన్ ఉపయోగించే వీలు ఉంది.

Read More : Larissa Bonesi : లరిస్సా లవ్లీ పిక్స్..

కరోనా వ్యాక్సిన్ తయారులో జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ నిమగ్నమైన సంగతి తెలిసిందే. అమెరికాకు చెందిన ఈ సంస్థ…తాజాగా సింగిల్ డోస్ తయారు చేసింది. ‘జాన్సెన్’ పేరిట తయారు చేసిన ఈ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతినివ్వాలంటూ…శుక్రవారం దరఖాస్తు చేసుకుంది. గతంలో ఈ సంస్థ భారతదేశంలో ప్రయోగాల కోసం దరఖాస్తు చేసుకుని..చివరి నిమిషంలో ఉపసంహరించుకుంది.

Read More :PM Modi : రాజీవ్ ఖేల్ రత్న పేరు మార్పు..కొత్త పేరు ఇదే

ఇప్పటికే పలు దేశాలు అనుమతించిన ప్రముఖ వ్యాక్సిన్లను ట్రయల్స్ అవసరం లేకుండానే…అత్యవసర వినియోగానికి అనుమతించాలని భారత ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. పాత దరఖాస్తును ఉపసంహరించుకన్న అనంతరం తాజాగా..అత్యవసర వినియోగం కోసం మరోసారి దరఖాస్తు చేసుకుంది. భారతదేశ ప్రజలకు సింగిల్ డోస్ వ్యాక్సిన్ అందించే దిశగా…చాలా ముఖ్యమైన అడుగుగా సంస్థ అభివర్ణించింది. హైదరాబాద్ కు చెందిన బయోలాజికల్ ఈ లిమిటెడ్ సంస్థతో జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ చేతులు కలిపిన సంగతి తెలిసింది. మరి ప్రభుత్వం అనుమతినిస్తుందా ? లేదా ? అనేది చూడాలి.