Joshimath Sinking : ప్రమాదంలో పవిత్ర క్షేత్రం జోషి‎మఠ్.. గుండెల నిండా బాధతో ఇళ్లను ఖాళీ చేస్తున్న ప్రజలు

ప్రకృతి ప్రకోపమో, మానవ తప్పిదమో కానీ.. పవిత్ర పుణ్యక్షేత్రం జోషిమఠ్ కనుమరుగవుతోంది. వందలాది కట్టడాల్లో పగుళ్లు ఏర్పడటం స్థానికులను భయాందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికే ప్రమాద స్థితిలో ఉన్న ఇళ్ల నుంచి ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు. గుండెల నిండా బాధతో భారంగా ఇళ్లను వదిలి వెళ్లిపోతున్నారు స్థానికులు.(Joshimath Sinking)

Joshimath Sinking : ప్రమాదంలో పవిత్ర క్షేత్రం జోషి‎మఠ్.. గుండెల నిండా బాధతో ఇళ్లను ఖాళీ చేస్తున్న ప్రజలు

Joshimath sinking

Joshimath Sinking : ప్రకృతి ప్రకోపమో, మానవ తప్పిదమో కానీ.. పవిత్ర పుణ్యక్షేత్రం జోషిమఠ్ కనుమరుగవుతోంది. వందలాది కట్టడాల్లో పగుళ్లు ఏర్పడటం స్థానికులను భయాందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికే ప్రమాద స్థితిలో ఉన్న ఇళ్ల నుంచి ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు. గుండెల నిండా బాధతో భారంగా ఇళ్లను వదిలి వెళ్లిపోతున్నారు స్థానికులు.

దాదాపు 700 ఇళ్లు డేంజర్ జోన్ లో ఉన్నాయని, దాదాపు 150 కుటుంబాలను పునరావాస శిబిరాలకు పంపినట్లు అధికారులు తెలిపారు. అటు కూల్చివేతలను వ్యతిరేకిస్తూ జోషిమఠ్ ప్రజలు ఆందోళన బాట పట్టారు. తమకు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు.

Also Read..Joshimath sinking : విపత్తు ప్రభావిత ప్రాంతంగా జోషిమఠ్..: ప్రకటించిన కలెక్టర్

ఇప్పటికే ఇళ్లకు పగుళ్లు ఏర్పడి బిక్కుబిక్కుమంటూ భయంతో ఉన్న ప్రజలపై మరో పిడుగు పడింది. నిన్న వర్షం కురవడంతో కొండచరియలు విరిగిపడుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. మరోవైపు జోషిమఠ్ లో పర్యటించిన ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ బాధితులను పరామర్శించారు. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రధాని మోదీ స్వయంగా పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు.

నిన్న రాత్రి అక్కడే బస చేసిన ముఖ్యమంత్రి.. ఇళ్లను కూల్చివేయడం లేదని స్పష్టం చేశారు. ఇప్పటివరకు కేవలం రెండు హోటల్స్ మాత్రమే కూల్చి వేసినట్లు వివరించారు. మార్కెట్ రేటును బట్టి బాధితులకు పరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ. అత్యవసర సహాయం కింద ఒక్కో కుటుంబానికి లక్షన్నర రూపాయలు అందిస్తున్నట్లు చెప్పారు.

Also Read..Joshimath Sinking : కుంగిపోతున్న భూమి, ఇళ్లకు పగుళ్లు.. జోషిమఠ్‌లో ఈ భయానక పరిస్థితులకు కారణమిదే..!

అటు జోషిమఠ్ ఘటనపై ప్రతిపక్షాలు అసత్యాలు ప్రచారం చేస్తున్నాయని ముఖ్యమంత్రి ధామీ మండిపడ్డారు. ఫిబ్రవరి నెలలో జరగనున్న ఇంటర్నేషనల్ వింటర్ గేమ్స్, మరి కొన్ని నెలల్లో ప్రారంభం కానున్న చార్ దామ్ యాత్ర నేపథ్యంలో ఇలాంటి ప్రచారాలు తప్పుడు సంకేతాలు పంపుతాయని, రాష్ట్రం నష్టపోతుందని ముఖ్యమంత్రి వాపోయారు.

హిందువులు, సిక్కులు, బౌద్ధులకు ఎంతో పవిత్ర క్షేత్రం జోషిమఠ్. దీని చరిత్ర ఈనాటిది కాదు. మహాభారతం కాలంతో ఇది ముడి పడి ఉంది. కురుక్షేత్ర యుద్ధం తర్వాత పాండవులు స్వర్గారోహణకు ఈ మార్గం నుంచే వెళ్లినట్లు చరిత్రకారులు చెబుతారు. జోషిమఠ్ నుంచి బద్రీనాథ్ మీదుగా వీరు స్వర్గారోహణ చేశారని, భారత దేశ చిట్టచివరి గ్రామమైన మౌనా ప్రాంతంలో ద్రౌపది తుది శ్వాస విడిచినట్లు చెబుతుంటారు.

ఇక, ఆది శంకరాచార్యులకు ఇక్కడే ఓ చెట్టు కింద జ్ఞానోదయం అయినట్లు కూడా చెబుతారు. అందుకే ఈ ప్రాంతాన్ని జ్యోతిర్ ధామ్ అని ఆ చెట్టుని కల్పవృక్షంగా పిలుస్తారు. ఈ చెట్టు పక్కనే ఉండే దేవాలయం, గుహ కూడా ప్రస్తుతం ధ్వంసమైపోయింది. ఈ గుహలోనే శంకరాచార్యులు ధ్యానం చేసినట్లు చెబుతారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

జోషిమఠ్ గురించి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. ప్రహ్లాదుడు ఇక్కడే మోక్షం పొందినట్లు కూడా చెబుతారు. ఇక్కడ చాలా దేవాలయాలతో పాటు నీటి ఊటలు కూడా ఉన్నాయి. సముద్ర మట్టానికి 6వేల 107 అడుగుల ఎత్తులో డౌలీ విష్ణు గంగల సంగమానికి అరకిలోమీటర్ దూరంలో ఉంటుంది ఈ జోషిమఠ్. టిబెట్ కు సమీపంలో ఉండటంతో వ్యూహాత్మకంగానూ జోషిమఠ్ కీలకమైన ప్రాంతంగా ఉంది. దీంతో ఇక్కడ భారీగా సైన్యం, సాయుధ బలగాలు మోహరించింది భారత సైన్యం.

ఇంతటి చారిత్రాత్మకమైన జోషిమఠ్ నేడు ప్రమాదంలో పడింది. కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. అయితే, జోషిమఠ్ కు మాత్రమే కాదు నైనిటాల్, చంపావత్ వంటి నగరాలకు సైతం ముప్పు పొంచి ఉందని భౌగోలిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు.