Supreme Court Chief Justice DY Chandrachud : సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా ప్ర‌మాణ స్వీకారం చేసిన జ‌స్టిస్ చంద్ర‌చూడ్

సుప్రీంకోర్టు 50వ ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా జ‌స్టిస్ ధ‌నుంజ‌య్ య‌శ్వంత్ చంద్ర‌చూడ్ ప్ర‌మాణ స్వీకారం చేశారు. ఇవాళ రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లో రాష్ట్ర‌ప‌తి ముర్ము ఆయ‌న చేత ప్ర‌మాణ స్వీకారం చేయించారు. సీజేఐగా రెండేళ్ల పాటు ఆయ‌న విధులు నిర్వ‌ర్తించ‌నున్నారు. 2024, న‌వంబ‌ర్ 10వ తేదీ వ‌ర‌కు ఆయ‌న సీజేఐగా కొనసాగుతారు.

Supreme Court Chief Justice DY Chandrachud : సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా ప్ర‌మాణ స్వీకారం చేసిన జ‌స్టిస్ చంద్ర‌చూడ్

chief justice DY Chandrachud

Updated On : November 9, 2022 / 12:41 PM IST

Supreme Court Chief Justice DY Chandrachud : సుప్రీంకోర్టు 50వ ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా జ‌స్టిస్ ధ‌నుంజ‌య్ య‌శ్వంత్ చంద్ర‌చూడ్ ప్ర‌మాణ స్వీకారం చేశారు. ఇవాళ రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లో రాష్ట్ర‌ప‌తి ముర్ము ఆయ‌న చేత ప్ర‌మాణ స్వీకారం చేయించారు. సీజేఐగా రెండేళ్ల పాటు ఆయ‌న విధులు నిర్వ‌ర్తించ‌నున్నారు. 2024, న‌వంబ‌ర్ 10వ తేదీ వ‌ర‌కు ఆయ‌న సీజేఐగా కొనసాగుతారు.

జ‌స్టిస్ చంద్ర‌చూడ్ 1959, న‌వంబ‌ర్ 11న జ‌న్మించారు. 1979లో ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో ఆయ‌న గ్రాడ్యుయేష‌న్ పూర్తి చేశారు. 1982లో ఢిల్లీ యూనివ‌ర్సిటీ నుంచి ఎల్ఎల్‌బి పూర్తి చేశారు. 1983లో హార్వ‌ర్డ్ యూనివ‌ర్సిటీలో ఎల్ఎల్ఎమ్ చేశారు. 1986లో హార్వ‌ర్డ్ నుంచే జురిడిక‌ల్ సైన్సెస్‌లో(ఎస్జేడీ) డాక్ట‌ర్ ప‌ట్టా పొందారు.

Justice DY Chandrachud: భారత నూతన న్యాయమూర్తిగా నియామకమైన జస్టిస్ చంద్రచూడ్ గురించి 5 కీలక విషయాలు

44 ఏళ్ల క్రితం సీజేఐ డీ.వై చంద్ర‌చూడ్ తండ్రి జ‌స్టిస్ వై.వీ చంద్ర‌చూడ్ కూడా భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా చేశారు. జ‌స్టిస్ వైవీ చంద్ర‌చూడ్ అత్య‌ధికంగా ఏడేళ్ల పాటు సీజేఐగా పని చేశారు. 1998 నుంచి 2000 వ‌ర‌కు అద‌న‌పు సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్‌గా జ‌స్టిస్ చంద్ర‌చూడ్ చేశారు. 1998లో బాంబే హైకోర్టులో ఆయ‌న సీనియ‌ర్ అడ్వ‌కేట్‌గా న‌మోదు అయ్యారు.

పౌర, మ‌త‌, భాషాప‌ర‌మైన‌ హ‌క్కుల‌తో పాటు అనేక కేసుల్లో ఆయ‌న వాదించారు. 2000, మార్చి 29న బాంబే హైకోర్టులో అద‌న‌పు జ‌డ్జిగా నియ‌మితుల‌య్యారు. 2013, అక్టోబ‌ర్ 31న ఆయ‌న అల‌హాబాద్ హైకోర్టు చీఫ్ జ‌స్టిస్‌గా అపాయింట్ అయ్యారు. 2016, మే 13వ తేదీన సుప్రీంకోర్టు జ‌డ్జిగా పొదోన్నతి పొందారు.