కర్ణాటక బస్సులో కరోనా కాలపు కండెక్టర్‌ని చూడండీ..దటీజ్ కోవిడ్-19 టైమ్

  • Published By: nagamani ,Published On : June 6, 2020 / 06:33 AM IST
కర్ణాటక బస్సులో కరోనా కాలపు కండెక్టర్‌ని చూడండీ..దటీజ్ కోవిడ్-19 టైమ్

కలికాలం కాదు కరోనా కాలం అన్నట్లుగా ఉంది పరిస్థితి. డాక్టర్లే కాదు బస్ కండక్టర్లు కూడా కరోనా డ్రెస్ (PPE kit) లతో బస్సులో టికెట్ టికెట్ అంటున్నారు. కర్ణాటక రాష్ట్రంలో లాక్ డౌన్ తరువాత బస్సులు రోడ్లమీదకు వచ్చాయి. 

ఈక్రమంలో మంగళూరులోని శక్తి నగర్ స్టేట్ బ్యాంక్ రూట్ లో ఓ బస్సులో కండక్టర్ కరోనా డ్రెస్ తో (పీపీఈ కిట్)తో బస్సులో డ్యూటీకి వచ్చాడు. ప్రయాణీకుల దగ్గర నుంచి టికెట్ టికెట్ అంటూ తిరుగుతున్న అతన్నిచూసినవారు కలికాలం అంటుంటే..కాదు కాదు ఇది కరోనా కాలం తప్పదు ఇటువంటి అనుకుంటున్నారు.   

కరోనా నిబంధనలతో బస్సులను నడుపుతోంది కర్ణాటక ప్రభుత్వం. బస్సులో డ్రైవర్ , కండక్టర్లతో పాటు  ప్రయాణీకులంతా మాస్క్లు ధరించాలని తెలిపింది. అంతేకాదు  ప్రయాణీకులు బస్సులో భౌతిక దూరం పాటిస్తూ ఉండాలని కాబట్టి సీటుకు ఇద్దరు మాత్రమే కూర్చోవాలని తెలిపింది. పరిమితికి మించి బస్సులో ప్రయాణీకులను ఎక్కించకోవద్దంటూ ప్రభుత్వం హెచ్చరించింది. దీంతో బస్సులో భౌతిక దూరం పాటిస్తున్నారు. 

ఇదే క్రమంలో  మంగళూరులోని శక్తి నగర్ స్టేట్ బ్యాంక్ రూట్ లో ఓ బస్సులో కండక్టర్ కరోనా డ్రెస్ తో (పీపీఈ కిట్)తో బస్సులో డ్యూటీ చేస్తూ కనిపించాడు. మరి కరోనా కాలం కదూ..ఆ మాత్రం జాగ్రత్త తీసుకోవాల్సిందే. 

Read:  ఈడీ హెడ్ క్వార్టర్స్ లో కరోనా కలకలం, ఆరుగురు ఉద్యోగులకు కొవిడ్