Karnataka elections 2023: కిరీటం వంటి తలపాగాను ధరించిన ప్రధాని మోదీ.. ప్రత్యేకత ఏంటీ?

Karnataka elections 2023: బహిరంగ సభలో మోదీ తలపై స్థానిక నేతలు అక్కడి సాంప్రదాయ తలపాగా పెట్టారు.

Karnataka elections 2023: కిరీటం వంటి తలపాగాను ధరించిన ప్రధాని మోదీ.. ప్రత్యేకత ఏంటీ?

Karnataka elections 2023

Karnataka elections 2023: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) మరోసారి సాంప్రదాయ తలపాగా ధరించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు (Karnataka elections 2023) ఈ నెల 10న జరగాల్సి ఉన్న నేపథ్యంలో ప్రధాన పార్టీల అగ్రనేతలు ఆ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఇవాళ ప్రధాని మోదీ ఉత్తర కన్నడ జిల్లాల్లోని అంకోలాలో ర్యాలీలో పాల్గొన్నారు.

అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మోదీ తలపై స్థానిక నేతలు అక్కడి సాంప్రదాయ తలపాగా పెట్టారు. ఉత్తర కన్నడ సాంప్రదాయంలో భాగంగా దీన్ని ధరిస్తారు. ఈ తలపాగా ఓ కిరీటంలా ఉంటుంది. పైన నెమలి పించం కూడా ఉంది. అంతేగాక, ప్రసంగిస్తోన్న సమయంలో మోదీ మరో రకం తలపాగాను ధరించారు. అక్కడి సంస్కృతి, సంప్రదాయాలను ఇవి ప్రతిబింబిస్తున్నాయి.

గతంలోనూ మోదీ ఎన్నో రకాల తలపాగాలతో కనపడిన విషయం తెలిసిందే. ఆయా ప్రాంతాల్లో మోదీ పర్యటించినప్పుడు ఆయనకు స్థానిక ప్రజలు ఇటువంటి బహుమతులు ఇస్తున్నారు. మోదీ 2014, డిసెంబరు 1న సోమవారం నాగాలండ్ హార్న్‌బిల్ పండుగలో పాల్గొనప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్నో రకాల తలపాగాలు ధరించి కనపడ్డారు.

అంతేకాదు, 2015 జనవరి 26 నుంచి ప్రతీ ఏడాది గణతంత్ర దినోత్సవం రోజున ఒక్కో రకం తలపాగాతో కనపడుతున్నారు. కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో జనాలు పూల వర్షంతో మోదీకి స్వాగతం పలుకుతున్నారు.


PM Modi’s Turban: తొమ్మిదేళ్లు.. తొమ్మిది తలపాగాలు.. జనవరి 26న ప్రధాని మోదీ ఏ సంవత్సరం ఏ తలపాగా ధరించారో ఓ లుక్కేద్దాం ..!