Omicron India : ఒమిక్రాన్ కట్టడికి..కర్నాటక సర్కార్ చేస్తున్న వ్యూహాలేంటీ ?

ఒమిక్రాన్‌ సోకిన వారితో కాంటాక్ట్ అయిన పలువురిని అధికారులు గుర్తించారు. వీరిలో ఐదుగురికి కరోనా పాజిటివ్‌గా తేలింది.

Omicron India : ఒమిక్రాన్ కట్టడికి..కర్నాటక సర్కార్ చేస్తున్న వ్యూహాలేంటీ ?

Omicron

Karnataka Issues New Omicron Rules : ఒమిక్రాన్‌ వైరస్ దృష్ట్యా కర్ణాటక సర్కార్ అప్రమత్తమైంది. ఆ రాష్ట్రంలో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఒమిక్రాన్‌ ఎంట్రీతో వేరియంట్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగా పంచ వ్యూహంతో కర్ణాటక సర్కార్ ముందుకెళ్తోంది. కరోనా కట్టడికి టెస్టులు, ట్రేసింగ్, ట్రీట్‌మెంట్‌తో పాటు వ్యాక్సినేషన్‌, నిఘా వ్యూహాలు అమలు చేస్తోంది. స్కూల్స్, కాలేజీల్లో సాంస్కృతిక కార్యక్రమాలపై కర్ణాటక ప్రభుత్వం నిషేధం విధించింది. రెండు డోసులు వ్యాక్సిన్‌ తీసుకున్న వారినే మాల్స్‌, పార్కులు, థియేటర్లలోకి అనుమతిస్తున్నారు.

Read More : Omicron: హైదరాబాద్‌లో మళ్లీ ఆంక్షలు.. వైరస్‌ హాట్‌స్పాట్‌లు గుర్తింపు

హెల్త్‌ వర్కర్స్‌కి తప్పనిసరిగా కరోనా టెస్టులు చేయాలని కర్ణాటక సర్కార్ నిర్ణయం తీసుకుంది. బెంగళూరు పరిధిలో మాస్క్‌ లేకుంటే 250 జరిమానా విధిస్తున్నారు. విదేశాల నుంచి వచ్చి ఆచూకీ తెలియని ప్రయాణికుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే బెంగళూరులో ఇద్దరిలో ఒమిక్రాన్‌ వేరియంట్ బయటపడింది. బెంగళూరులో 66 ఏళ్ల వ్యక్తికి, 44 ఏళ్ల వ్యక్తికి వేరియంట్ సోకింది. ఇద్దరిలో ఒకరు సౌతాఫ్రికా పౌరుడు కాగా.. మరో వ్యక్తి ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన వ్యక్తిగా గుర్తించారు. వీరిలో ఒకరు నవంబర్‌ 11, మరొకరు నవంబర్‌ 20న ఇండియా వచ్చారు. తాజాగా ఆ ఇద్దరికి ఒమిక్రాన్‌గా తేలింది. అయితే ఇన్ని రోజులు వారి ఎవరెవరిని కలిశారు..? వారంతా ఎక్కడున్నారు..? ఒమిక్రాన్‌ సోకిన వారితో కాంటాక్ట్ అయిన వాళ్లందరిని ట్రేస్‌ చేసే పనిలో పడ్డారు అధికారులు.

Read More : Cyclone Jawad : జొవాద్ జెట్ స్పీడ్..ఉత్తరాంధ్రకు దగ్గరగా

ఇప్పటికే ఒమిక్రాన్‌ సోకిన వారితో కాంటాక్ట్ అయిన పలువురిని అధికారులు గుర్తించారు. వీరిలో ఐదుగురికి కరోనా పాజిటివ్‌గా తేలింది. అయితే వారికి కూడా ఒమిక్రాన్‌ సోకందా అన్న అనుమానంతో శాంపిల్స్‌ను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపారు. అయితే వీరిలో తీవ్రమైన లక్షణాలు ఏమి లేవని…ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదని అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు పాస్‌పోర్టులో పేర్కొన్న అడ్రస్‌లో విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులు లేకపోవడంతో… అధికారులు తలలు పట్టుకుంటున్నారు. వారికి ఒకవేళ ఒమిక్రాన్‌ వస్తే… వారి నుంచి మరింత వ్యాపించే ప్రమాదం ఉందని కంగారుపడుతున్నారు. దీంతో వీలైనంతా త్వరగా వారి ఆచూకీ తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారు.