పాక్ పై రాహుల్ ఫైర్…కశ్మీర్ విషయంలో ప్రభుత్వానికి మద్దతు

  • Published By: venkaiahnaidu ,Published On : August 28, 2019 / 06:02 AM IST
పాక్ పై రాహుల్ ఫైర్…కశ్మీర్ విషయంలో ప్రభుత్వానికి మద్దతు

జమ్మూకశ్మీర్ లో శాంతిభద్రతలకు విఘాతం కల్గించేలా హింసను ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ పై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. జమ్మూకశ్మీర్ కి సంబంధించిన ప్రతి ఒక్క విషయం భారత్ అంతర్గత వ్యవహారమని, పాక్ కు  గానీ, మరే ఇతర దేశానికి గానీ ఇందులో ఎలాంటి జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని  రాహుల్ సృష్టం చేశారు. ఆర్టికల్‌ 370ని రద్దు చేయడంపై కొంతకాలంగా ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వస్తున్న రాహుల్‌.. ఇప్పుడు ఇదే కశ్మీర్‌ అంశంపై ప్రభుత్వానికి మద్దతిస్తూ మాట్లాడటం విశేషం. 

చాలా విషయాల్లో ప్రభుత్వ చర్యలను నేను వ్యతిరేకించాను. కానీ ఈ విషయం స్పష్టంగా చెప్పాలనుకుంటున్నా.. కశ్మీర్‌ భారత అంతర్గత విషయం. ఇందులో పాకక గానీ, ఇతర ఏ దేశమైనా జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. జమ్ముకశ్మీర్‌లో హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. పాక్ మద్దతు, ప్రేరణ వల్లే ఈ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదానికి మద్దతిచ్చే ప్రధాన దేశం పాకిస్థాన్‌ అని తెలిసిందే కదా అని రాహుల్‌ ఇవాళ(ఆగస్టు-28,2019) వరుస ట్వీట్ లు చేశారు.  ]

కశ్మీర్‌ విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై కొన్నిరోజులుగా విమర్శలు చేస్తున్న రాహుల్‌…ఇలాంటి ట్వీట్లు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల కశ్మీర్‌లో పరిస్థితులను పర్యవేక్షించేందుకు రాహుల్‌ నేతృత్వంలో విపక్ష నేతల బృందం శ్రీనగర్‌ వెళ్లిన విషయం తెలిసిందే. అయితే భద్రతాకారణాల దృష్ట్యా వారిని ఎయిర్‌పోర్టు నుంచే వెనక్కి పంపించారు.