KBC 12 : కరోడ్ పతి నాజియా నాసిమ్

10TV Telugu News

KBC 12 winner Nazia Nasim : కౌన్ బనేగా కరోడ్ పతి 12వ సీజన్ లో కోటి రూపాయలు గెలుచుకున్నారు ఓ మహిళ. ఈమె జార్ఖండ్ లోని రాంచీ ప్రాంతానికి చెందిన వారు. అమితాబ్ అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పి మొత్తం ఫ్రైజ్ మనీని గెలిచి…వార్తల్లో నిలిచారు. 12వ సీజన్ లో మొదటి కరోడ్ పతి మహిళ కావడం గర్వంగా ఉందని వ్యాఖ్యాత అమితాబ్ అన్నారు.ఢిల్లీలో నివాసి నాజియా ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ లో నాజియా చదువుకున్నారు. ప్రస్తుతం ఓ మోటార్ బైక్ కంపెనీలో ఇంటర్నల్ కమ్యూనికేషన్ గ్రూప్ మేనేజర్ గా పని చేస్తున్నారు. ఈమె కౌన్ బనేగా కరోడ్ పతిలో పాల్గొన్నారు. 15 ప్రశ్నలకు సరిగ్గా సమాధానం ఇచ్చి రూ. 1 కోటి రూపాయలు గెలుచుకున్నారు. గెలుచుకున్న డబ్బు ఎలా ఖర్చు చేయాలనే దానపై కూర్చొని నిర్ణయించుకుంటామని, చుట్టుపక్కల జీవితాల్లో మార్పు తెచ్చేలా చూస్తామన్నారు.గెలిచిన అనంతరం తనకు అభినందనలు తెలియచేశారని, పాత సంబంధాలను తిరిగి పుంజుకోవడం ఆనందంగా ఉందన్నారు. వేరే మహిళ విజయం సాధిస్తే..అంతే సంతోషంగా ఉండేదానని, మహిళల హక్కులను పెద్దగా ప్రచారం చేస్తున్నట్లు వెల్లడించారామె. స్వేచ్చ ఇచ్చిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు తెలిపారు. తాను ఈస్థాయి రావడానికి తల్లి, భర్తలు కారణమన్నారు.తాను ఈ షోలో ఇంతదూరం వెళుతానని ఊహించలేదని, కల సాకారం చేయాలని అనుకున్నట్లు తెలిపారు. తాను రూ. కోటి గెలుచుకున్నానని అమితాబ్ చెప్పినప్పుడు తాను ఉద్వేగానికి గురయినట్లు, నిలబడి తనను మెచ్చుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఇక అమితాబ్ విషయానికి వస్తే..ఎంతో కలివిడిగా ఉంటారని, ప్రోత్సాహిస్తారన్నారు. జోకులు వేస్తూ..నవ్విస్తుంటారని, ఆయనతో మాట్లాడడం స్పూర్తిదాయకమన్నారు. అనుభవం ఉన్న వారు తప్పకుండా..కేబీసీకి వెళ్లాలని, జీవితాన్ని మార్చేస్తుందని నాజియా తెలిపారు.

×