సీఎం కేసీఆర్ కేంద్రానికి సూచించిన QE, Helicopter Moneyలు అంటే..

సీఎం కేసీఆర్ కేంద్రానికి సూచించిన QE, Helicopter Moneyలు అంటే..

తెలంగాణ సీఎం కేసీఆర్ కరోనా వ్యాప్తిని అడ్డుకునే క్రమంలో మరి కొన్ని రోజులు అంటే ఏప్రిల్ 30 వరకూ లాక్‌డౌన్ పొడిగించనున్నట్లు ప్రకటించారు. ఏప్రిల్ 11న ప్రెస్ మీట్ పెట్టి మీడియా సమక్షంలో నిర్ణయాన్ని వెల్లడించారు. అంతేకాకుండా దేశం, రాష్ట్రం ఆర్థికంగా నష్టాల్లో ఉన్నాయని అవి కోలుకోవడానికి క్వాంటిటేటివ్ ఈజింగ్ ఒక్కటే మార్గమని సూచించారు. అసలు దాని గురించి ఆయన ఏమన్నారో ఓ సారి చూద్దాం. 

1918 స్పానిష్ ఫ్లూ, 2008లో గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది. ఈ రెండు సందర్భాల్లో ప్రపంచం ఒక పద్ధతిని అవలంభించింది. ఇటువంటి సంక్షోభాలు వచ్చినప్పుడు.. కేంద్రం, రాష్ట్రం ప్రభుత్వాల దగ్గర డబ్బుల్లేనప్పుడు క్వాంటిటేటివ్ ఈజింగ్ పద్ధతిని వాడాలి. ఇది చాలా పాపులర్ టెక్నిక్. ఇదొక్కటే ఏకైక మార్గం. 

క్వాంటిటేటివ్ ఈజింగ్ అంటే:అమెరికాకు అమెరికన్ ఫెడరల్ బ్యాంక్, యునైటెడ్ కింగ్‌డమ్‌కు బ్యాంక్ ఆఫ్ లండన్ ఉంది. జపాన్ కు బ్యాంక్ ఆఫ్ జపాన్ ఉంది. చైనాకు పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా ఉంది. ప్రతి దేశానికి మన దేశంలాగే రిజర్వ్ బ్యాంక్ ఇండియా మాదిరిగానే ఉంటాయి. వారంతా వారి వారి బ్యాంకుల ద్వారా దేశానికి ఉన్న జీడీపీని బట్టి కొంత శాతాన్ని ఆ డబ్బును మార్కెట్లోకి రిలీజ్ చేస్తారు. 

తద్వారా ఈ విపత్కర పరిస్థితి నుంచి బయటపడొచ్చు. అమెరికా ఇప్పటికే  10శాతం అంటే 2ట్రిలియన్ డాలర్లు ఇచ్చారు. యూకే జీడీపీలోని 15శాతం ఇవ్వడానికి ముందుకు వచ్చారు. మనం కూడా మిగిలిన ఆ ఒక్క టెక్నిక్ ను వాడుకోవాలి. మన జీడీపీ 1920కి 203లక్షల కోట్లుగా నిర్ధారించబడింది. అందులో 5శాతం మనకు నిర్ణయిస్తే 10లక్షల కోట్లు మనకు వచ్చే ఆస్కారం ఉంది. 

అమెరికా, బ్రిటన్ గవర్నమెంట్ లాంటి అనేక దేశాలు ఇదే పద్ధతి అవలంభిస్తున్నాయి. మన దేశం కూడా క్వాంటిటేటివ్ ఈజింగ్‌నే అనుసరించాలి. 

హెలికాఫ్టర్ మనీ అంటే:
హెలికాఫ్టర్ మనీ అంటే చాలా పెద్ద మొత్తంలో నేరుగా డబ్బులను ప్రజల వద్దకు తీసుకెళ్లడం. ఆర్థిక కుంగుబాటు నుంచి కోలుకోవడానికి లేదా వడ్డీ రేట్లు పూర్తిగా పడిపోయినప్పుడు నేరుగా ప్రజల వద్దకు సొమ్మును తీసుకెళ్లడాన్నే హెలికాఫ్టర్ మనీ అంటారు.