Kerala : కేరళలో జూన్ 16వరకు లాక్ డౌన్ పొడిగింపు

కరోనా వైరస్ కట్టడికి చర్యలు తీసుకుంటున్నప్పటికీ మహమ్మారి వ్యాప్తి తగ్గకపోవడంతో కేరళ ప్రభుత్వం మరోసారి లాక్ డౌన్ ను పొడిగించింది.

Kerala : కేరళలో జూన్ 16వరకు లాక్ డౌన్ పొడిగింపు

Kerala

Kerala కరోనా వైరస్ కట్టడికి చర్యలు తీసుకుంటున్నప్పటికీ మహమ్మారి వ్యాప్తి తగ్గకపోవడంతో కేరళ ప్రభుత్వం మరోసారి లాక్ డౌన్ ను పొడిగించింది. రాష్ట్రంలో కరోనా క‌ట్ట‌డికి విధించిన‌ లాక్‌డౌన్ ను జూన్ 16 వ‌ర‌కూ పొడిగిస్తున్నట్లు సోమవారం కేరళ ప్రభుత్వం ప్రకటించింది. నిత్యావ‌స‌రాల దుకాణాలు, ప‌రిశ్ర‌మ‌ల‌కు ముడిప‌దార్ధాలు అందించే అవుట్ లెట్లు, నిర్మాణ రంగ కార్య‌కలాపాలు, బ్యాంకులను య‌ధావిధిగా అనుమ‌తిస్తామ‌ని కేరళ సీఎం కార్యాలయం తెలిపింది. అయితే, వైర‌స్ నియంత్ర‌ణ‌కు ఈనెల 12, 13 తేదీల్లో పూర్తి లాక్‌డౌన్(కంప్లీట్ లాక్ డౌన్)ఉంటుందని తెలిపింది.

కేర‌ళ‌లో సోమవారం 9,313 కొత్త కరోనా కేసులు,221మరణాలు నమోదైనట్లు ఆ రాష్ట్ర శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. గడిచిన 24గంటల్లో 70,569 శాంపిల్స్ కు టెస్ట్ లు చేసినట్లు ఆ ప్రకటనలో తెలిపింది. ఇక,మొత్తంగా కేరళలో మరణాల సంఖ్య 10 వేలు దాటగా,పాజిటివిటీ రేటు 13.2శాతంగా ఉంది.

మ‌రోవైపు దేశ‌వ్యాప్తంగా ఉచిత వ్యాక్సినేష‌న్ చేప‌డ‌తామ‌ని, కేంద్ర‌మే వ్యాక్సిన్లు సేక‌రించి రాష్ట్రాల‌కు స‌ర‌ఫ‌రా చేస్తుంద‌ని ప్ర‌ధాని మోడీ చేసిన ప్ర‌క‌ట‌న‌ను కేర‌ళ సీఎం స్వాగ‌తించారు. స‌రైన స‌మ‌యంలో ప్ర‌ధాని ఈ ప్ర‌క‌ట‌న చేశార‌ని పిన‌ర‌యి విజ‌య‌న్ అన్నారు.