Lawyer Shot Dead: జిల్లా కోర్టు వద్దే లాయర్ దారుణ హత్య

జిల్లా కోర్టు వద్దే లాయర్ ను కాల్చి హత్య చేశారు. ఉత్తరప్రదేశ్ లోని షాజహాన్‌పూర్‌లో జిల్లా కోర్టు కాంప్లెక్స్ లో ఘటన జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు.

10TV Telugu News

Lawyer Shot Dead: జిల్లా కోర్టు వద్దే లాయర్ ను కాల్చి హత్య చేశారు. ఉత్తరప్రదేశ్ లోని షాజహాన్‌పూర్‌లో జిల్లా కోర్టు కాంప్లెక్స్ లో ఘటన జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. కోర్టులోని మూడో అంతస్థులో అతని మృతదేహం దొరికింది. దేశీవాలీ తుపాకీ సైతం అక్కడే పడేసి వెళ్లిపోయారు దుండగులు.

వేరొకరితో మాట్లాడుతుండగా ఒక్క సారిగా వచ్చిన పెద్ద శబ్దంతో లాయర్ కుప్పకూలాడు.

……………………………………….. : నీ కాళ్ళను పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు..

‘మాకు వివరాలేమీ తెలియదు. మేం కోర్టులో ఉన్నాం. ఒక వ్యక్తి వచ్చి ఘటన గురించి చెప్పాడు. అంతే షాట్ తగిలిన వెంటనే చనిపోయాడు. దేశీవాలీ తుపాకీతో పాటు, మృతదేహం అక్కడ పడి ఉంది. గతంలో బ్యాంకు ఉద్యోగి అయిన వ్యక్తి ప్రస్తుతం నాలుగైదేళ్లుగా లాయర్ ప్రాక్టీస్ లో ఉన్నాడు’ అని మరో న్యాయవాది చెప్పాడు.