LIC IPO : ఎల్ఐసీ ఐపీవో.. మార్చి 31లోపు లిస్ట్

రూ.32,835 కోట్ల మేర‌కు ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల ఉప‌సంహ‌ర‌ణ ద్వారా కేంద్రం స‌మ‌కూర్చుకుంది. ఈ ఏడాది బ‌డ్జెట్‌లో పెట్టుబ‌డుల ఉప‌సంహ‌ర‌ణ ద్వారా రూ.1.75 ల‌క్షల కోట్లు సేక‌రించాల‌ని

LIC IPO : ఎల్ఐసీ ఐపీవో.. మార్చి 31లోపు లిస్ట్

Lic Ipo

LIC IPO Insurance : భార‌తీయ జీవిత బీమాసంస్థ ఐపీవోకు ముహూర్తం ఖ‌రారైంది. ఎల్ఐసీ ఐపీవో మార్చి 31వ తేదీ లోపు దేశీయ స్టాక్ మార్కెట్లను తాకనుంది. ఎల్ఐసీ ఐపీవో ముసాయిదా ప‌త్రాలు ఖ‌రారు చేసే ప‌నిలో ఉన్నామ‌ని అధికారులు చెప్పారు. ఎల్ఐసీలో వాటాల ఉప‌సంహ‌ర‌ణ ఈ ఆర్థిక సంవ‌త్సరంలోనే జ‌రుగుతుంద‌ని, అందుకు మార్చి 31లోపు లిస్టవుతుంద‌ని తెలిపారు. మార్చి నెలాఖ‌రుతో ముగిసే ఆర్థిక సంవ‌త్సరానికి ఎల్ఐసీ ఐపీవో చాలా కీల‌కం కానుంది. ఎల్ఐసీ ఐపీవోతోనే పెట్టుబ‌డుల ఉప‌సంహ‌ర‌ణ ల‌క్ష్యాన్ని కేంద్ర బ‌డ్జెట్ చేరుకోగ‌ల‌దు.

Read More : Himaja : నా పెళ్లికి నన్ను కూడా పిలవండి.. విడాకుల వార్తలపై స్పందించిన హిమజ..

గ‌త ఆర్థిక సంవ‌త్సరంలో కేవ‌లం రూ.32,835 కోట్ల మేర‌కు ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల ఉప‌సంహ‌ర‌ణ ద్వారా కేంద్రం స‌మ‌కూర్చుకుంది. ఈ ఏడాది బ‌డ్జెట్‌లో పెట్టుబ‌డుల ఉప‌సంహ‌ర‌ణ ద్వారా రూ.1.75 ల‌క్షల కోట్లు సేక‌రించాల‌ని కేంద్రం ల‌క్ష్యంగా పెట్టుకుంది. రూ.1.75 ల‌క్షల కోట్లలో ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా రూ. ల‌క్ష కోట్లు, ప్రభుత్వ రంగ సంస్థల వాటాల ఉపసంహ‌ర‌ణ ద్వారా రూ.75 వేల కోట్లు సేకరించాల‌ని కేంద్రం ల‌క్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఇప్పటి వ‌ర‌కు ప్రభుత్వానికి వివిధ రంగ సంస్థల్లో వాటాల ఉప‌సంహ‌ర‌ణ ద్వారా రూ.9,330 కోట్లు మాత్రమే వ‌చ్చాయి. ఎల్ఐసీ లాభాల ద్వారా రూ.1437 కోట్లు కేంద్రానికి వ‌చ్చాయి.