జమ్ములో 100 ఎకరాల్లో శ్రీవారి ఆలయం..స్థలాన్ని సందర్శించిన ఛైర్మన్ సుబ్బారెడ్డి

  • Published By: nagamani ,Published On : August 27, 2020 / 11:05 AM IST
జమ్ములో 100 ఎకరాల్లో శ్రీవారి ఆలయం..స్థలాన్ని సందర్శించిన ఛైర్మన్ సుబ్బారెడ్డి

తిరుమల తిరుపతిలో ఏడు కొండలపై వెలసిన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వైభోగం ఇప్పుడు పచ్చని చల్లని జమ్మూ కశ్మీర్‌లో కూడా వెలయనుంది. పలు ప్రాంతాల్లో తిరుమల శ్రీ వేంకటేశ్వరుడి ఆలయాలను టీటీడీ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. దీంట్లో భాగంగా..జమ్మూ నగరంలో శ్రీనివాసుడి ఆలయం నిర్మించేందుకు టీటీడీ సిద్ధమైంది. దీనికి కావాల్సిన స్థలాన్ని కూడా ఇప్పటికే అధికారులు ఎంపిక చేశారు. గతంలో ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి బుధవారం (ఆగస్టు 26,2020) సందర్శించారు. ఇక వేగంగా నిర్మాణమే తరువాయి అన్నట్లుగా టీటీడీ పనులు చేపట్టి స్వామి దర్శనానికి ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు.


శ్రీవారి ఆలయ నిర్మాణానికి 100 ఎకరాల భూమిని కేటాయించారు. దీంతో టీటీడీ ఆలయ నమూనా వంటి అంశాలపై టీటీడీ దృష్టిపెట్టింది. త్వరలోనే టిటిడి ఇంజనీరింగ్ విభాగానికి చెందిన సిబ్బంది బృందం త్వరలోనే ఆ స్థలాన్ని సందర్శించి సమగ్ర నివేదికను సిద్ధం చేస్తుందని రెడ్డి జమ్మూలోని స్థానిక అధికారులకు తెలియజేశారు.
https://10tv.in/not-a-single2000-note-printed-in-2019-20-rbi-annual-report/

రాబోయే రెండేళ్లలో ఈ ఆలయ నిర్మాణం పూర్తి చేయాలని సంకల్పించగా..ఈ దేవాలయానికి అనుసంధానంగా ..ఓ వేద పాఠశాల, ఆస్పత్రిని కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే యావత్ ప్రపంచ వ్యాప్తంగా శ్రీవారికి భక్తులు ఉన్నారు. జమ్మూలో ఆలయాన్ని ఏర్పాటు చేయడం వల్ల మత పర్యాటక రంగాన్నిమరింత పెంచుతుందని భావిస్తున్నారు. శ్రీవారి ఆలయ నిర్మాణం జరగనున్న స్థలాన్ని సందర్శించినవారిలో టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డితో పాటు జమ్మూ జిల్లా కలెక్టర్ సుష్మా చౌహాన్, మాతా వైష్ణో దేవి ఆలయ సీఈఓ రమేష్ కుమార్, ఇతర అధికారులు ఉన్నారు.