Madhya Pradesh: బాలుడితో కాళ్లు పట్టించుకున్న ప్రభుత్వ ఆస్పత్రి ఉద్యోగి.. నోటీసులు జారీ.. వీడియో వైరల్

ప్రభుత్వ ఆస్పత్రికి చెందిన ఒక వైద్యుడు అమానుషంగా ప్రవర్తించాడు. బాలుడితో కాళ్లు పట్టించుకున్నాడు. ఈ ఘటనను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో అధికారులు స్పందించి అతడికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

Madhya Pradesh: బాలుడితో కాళ్లు పట్టించుకున్న ప్రభుత్వ ఆస్పత్రి ఉద్యోగి.. నోటీసులు జారీ.. వీడియో వైరల్

Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో ఒక ప్రభుత్వాసుపత్రి ఉద్యోగి అమానుషంగా ప్రవర్తించాడు. బాలుడితో కాళ్లు నొక్కించుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Gujarat: దంపతుల మధ్య గొడవ.. చిన్నారితో సహా 12వ అంతస్థు నుంచి దూకి జంట ఆత్మహత్య

మధ్యప్రదేశ్, షాహ్‌దోల్ జిల్లా, బియోహరి పట్టణంలోని ప్రభుత్వాసుపత్రిలో గత వారం ఈ ఘటన జరిగింది. ఆస్పత్రిలో పని చేస్తున్న ఒక ఉద్యోగి హాల్‌లో తోటి సిబ్బందితో కలిసి కుర్చీలో కూర్చుని ఉన్నాడు. ఈ సమయంలో ఒక బాలుడితో కాళ్లు పట్టించుకున్నాడు. ఆ బాలుడు కాళ్లకు మసాజ్ చేస్తుంటే, అతడు సిబ్బందితో మాట్లాడుతూ కాలక్షేపం చేస్తున్నాడు. ఈ ఘటనను అక్కడున్నవారెవరో వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో అక్కడి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాలుడితో ఒక ఉద్యోగి కాళ్లు పట్టించుకోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Sleep Champion Triparna: హాయిగా నిద్రపోయింది.. రూ.5 లక్షలు గెలుచుకుంది.. భారత ‘స్లీప్ ఛాంపియన్‌’‌గా నిలిచిన త్రిపర్ణ

దీంతో వైద్య శాఖ స్పందించింది. ఈ ఘటనలో కాళ్లు పట్టించుకున్న ఉద్యోగిని మహంద్రగా గుర్తించింది. ఈ ఘటనపై అతడికి షోకాజ్ నోటీసు జారీ చేసింది. అతడు చెప్పే సమాధానం ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని వైద్యాధికారులు వెల్లడించారు.