JNU ఘటన ముంబై ఉగ్రదాడిని గుర్తు చేసింది : మహా సీఎం

  • Published By: veegamteam ,Published On : January 6, 2020 / 09:36 AM IST
JNU ఘటన ముంబై ఉగ్రదాడిని గుర్తు చేసింది : మహా సీఎం

జేఎన్‌యూ క్యాంపస్‌లో విద్యార్థులు, ప్రొఫెసర్లపై ముసుగులు ధరించిన వ్యక్తులు చేసిన విధ్వంసం..విద్యార్ధులు..ప్రొఫెసర్లపై దాడితో పాటు పలు హింసాత్మక ఘటన 2008 నవంబర్ 26న ముంబైలో జరిగిన ఉగ్రదాడిని గుర్తు చేసిందని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే వ్యాఖ్యానించారు. ఈ దాడి దారుణమని..ఈ విధ్వంసం చేసిన ఆ ముసుగు వ్యక్తులు ఎవరో తేల్చాలనీ డిమాండ్ చేశారు శివసేన చీఫ్ మహా సీఎం ఉద్ధవ్ ఠాక్రే. జేఎన్ యూ ఘటనను ఉద్ధవ్ ట్వీట్‌లో తీవ్రంగా ఖండించారు. 
 
దేశంలో  విద్యార్థులు భయం గుప్పిట్లో చిక్కుకున్న బీతావహ వాతావరణం సృష్టించారనీ..అటువంటి హింసాత్మక ఘటనలు విద్యాలయాల్లో తగనివని అన్నారు. ఇటువంటి ఘటనలను ప్రతీ ఒక్కరూ ఖండించాలనీ..మనమంతా ఒకతాటి పైకి వచ్చి  విద్యార్ధుల్లో ఆత్మస్థైర్యం నెలకొల్పాలని పిలుపునిచ్చారు. ఈ ఘటనపై పలు రాష్ట్రాల సీఎంలతో సహా పలువురు ఖండిస్తున్నారు. విద్యార్ధుల జీవితాలతో వారి భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్నారంటూ విమర్శిస్తున్నారు. 

ఆదివారం (జనవరి 5) జేఎన్‌యూ క్యాంపస్‌లో ముసుగు వ్యక్తులు జరిపిన దాడిలో 30 మందికి పైగా విద్యార్థులు గాయపడగా, ఎయిమ్స్‌లో చికిత్స అనంతరం 23 మంది సోమవారం డిశ్చార్జి అయ్యారు.