Lady Conductor: డ్రైవర్ సీట్లో కూర్చుని వీడియోలు తీసుకున్న లేడీ కండక్టర్.. సస్పెండ్ చేసిన అధికారులు

సోషల్ మీడియాలో పోస్ట్ చేసేందుకు ఎక్కడపడితే అక్కడ వీడియోలు తీసుకుంటున్నారా? అయితే, ఇకపై జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే డ్రైవర్ సీట్లో కూర్చుని వీడియోలు తీసుకున్నందుకు ఒక లేడీ కండక్టర్ ఉద్యోగం కోల్పోయింది.

Lady Conductor: డ్రైవర్ సీట్లో కూర్చుని వీడియోలు తీసుకున్న లేడీ కండక్టర్.. సస్పెండ్ చేసిన అధికారులు

Lady Conductor: సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఉద్దేశంతో తీసుకునే వీడియోల విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. తాజాగా మహారాష్ట్రలో వీడియోల కోసం ఒక లేడీ కండక్టర్ చేసిన పని, ఆమె ఉద్యోగానికే ఎసరుపెట్టింది. ఆమె ఉద్యోగంలోంచి సస్పెండ్ అయ్యేలా చేసింది.

Human Sacrifice: గంజాయి మత్తులో దారుణం.. నరబలి పేరుతో ఆరేళ్ల బాలుడి హత్య.. నిందితుల అరెస్ట్

మహారాష్ట్ర స్టేట్ రోడ్ ట్రాన్స్‪పోర్ట్ కార్పొరేషన్ (ఎమ్ఎస్ఆర్‌టీసీ)కు చెందిన ఒక లేడీ కండక్టర్‌ను అధికారులు సస్పెండ్ చేశారు. కారణం ఆమె డ్రైవర్ సీట్లో కూర్చుని, వీడియోలు తీసి, వాటిని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడమే. ఒస్మానాబాద్ జిల్లా, కలంబ్ డిపోలో సాగర్ మంగళ్ గోవర్ధన్ అనే మహిళ కండక్టర్‌గా పని చేస్తోంది. అయితే, ఆమె అధికారుల అనుమతి లేకుండా డ్రైవర్ సీట్లో కూర్చుని వీడియోలు తీసుకుంది. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన అధికారులు ఆమెను సస్పెండ్ చేశారు. అయితే, గతంలో కొందరు సిబ్బంది సమ్మె చేసిన సమయంలో తాను డ్యూటీ చేసినందుకే అధికారులు తనపై చర్యలు తీసుకున్నారని సాగర్ మంగళ్ చెప్పింది.

Shri Bhagavad Gita Park: కెనడాలో శ్రీ భగవద్గీత పార్క్ బోర్డు ధ్వంసం.. ఖండించిన భారత్

అలాగే ఇటీవల ఆమె కొందరు సిబ్బందితో దురుసుగా మాట్లాడిందని, దీనిపై షోకాజ్ నోటీసులు కూడా జారీ చేశామని ఎమ్ఎస్ఆర్‌టీసీ అధికారులు తెలిపారు. ఏదేమైనప్పటికీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసే వీడియోలు తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే చిక్కుల్లో పడే అవకాశం ఉంది. ఎందుకంటే కొన్ని పబ్లిక్ ప్లేసులు, ఆఫీసులు, నిషేధిత ప్రాంతాలు ఉన్న చోట వీడియోలు తీసుకుంటే తర్వాత సమస్యలు ఎదుర్కోవాల్సి రావొచ్చు. ఇటీవల హైదరాబాద్‌లో ఒక యువతి మెట్రో స్టేషన్‌లో చేసిన డ్యాన్స్ వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. చాలా మంది తాము పని చేసే చోట వీడియోలు తీసుకుని ఇబ్బందుల పాలయ్యారు.