కరోనా కంట్రోల్ కోసం…మహారాష్ట్రలోని 5సిటీల్లో అన్నీ బంద్

  • Published By: venkaiahnaidu ,Published On : March 13, 2020 / 04:03 PM IST
కరోనా కంట్రోల్ కోసం…మహారాష్ట్రలోని 5సిటీల్లో అన్నీ బంద్

కరోనా వైరస్ ఇప్పుడు మహారాష్ట్రని వణికిస్తోంది. ఇప్పటికే కేరళ,కర్ణాటక,ఢిల్లీ వంటి రాష్ట్రాలు మాల్స్,స్కూల్స్,కాలేజీలు మూసివేసిన నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ దిశగా అడుగులు వేసింది. శుక్రవారం అర్ధరాత్రి నుంచి ముంబై, నవీ ముంబై, పూణె, పింప్రి- చించ్వాడ్, నాగ్‌పూర్‌లలో సినిమాహాళ్లు, జిమ్‌లు,స్విమ్మింగ్ పూల్స్‌,మాల్స్ ను మార్చి-30వరకు మూసివేయబడతాయని సీఎం ఉద్దవ్ ఠాక్రే ప్రకటించారు. సీఎం ఉద్దవ్ ప్రకటనతో  శనివారం నుంచి ఆయా నగరాలు బోసిపోనున్నాయి.

ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్ 1897 ప్రకారం ఈ అత్యవసర చర్యల ఆదేశాలు అమల్లోకి వస్తాయని ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే పేర్కొన్నారు. అలాగే, తమ ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేసే అవకాశం కల్పించాలని ఆన్ని ప్రభుత్వ,ప్రైవేటు కంపెనీలను సీఎం కోరారు.మాల్స్,థియేటర్లు వంటి పబ్లిక్ ప్లేస్ లలో ఉన్న వాటిని మూసివేస్తున్నప్పటికీ,ప్రభుత్వం బస్సులు,రైళ్లు వంటి ట్రాన్స్ పోర్ట్ మోడ్స్ ని షట్ డౌన్ చేయలేదని ఉద్దవ్ తెలిపారు. అయితే వీలైనంతవరకు ప్రయాణాలు చేయకపోవడమే బెటర్ అని ఉద్దవ్ సూచించారు.

కాగా, పూణే మరియు ముంబై, థాకేలో  పాఠశాలలు మూసివేయబడ్డాయని తెలిపారు. దేశంలో ఇప్పుడు కరోనా బాధితుల సంఖ్య 80కి చేరగా, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 5వేల మంది ఈ మహమ్మారి వల్ల ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలో ఇప్పటివరకు 17కరోనా కేసులు నమోదయ్యాయి.

See Also | 61 MLAలకు బర్త్ సర్టిఫికెట్లు లేవు….NPR,NRCలకు వ్యతిరేకంగా ఢిల్లీ అసెంబ్లీ తీర్మాణం