Maharashtra Politics : తన వద్ద ఉన్న 42మంది ఎమ్మెల్యేలను మీడియాకు చూపించి..బలప్రదర్శనకు రె‘ఢీ’ అంటున్న ఏక్ నాథ్ షిండే.. | Maharashtra Political Crisis

Maharashtra Politics : తన వద్ద ఉన్న 42మంది ఎమ్మెల్యేలను మీడియాకు చూపించి..బలప్రదర్శనకు రె‘ఢీ’ అంటున్న ఏక్ నాథ్ షిండే..

అనుక్షణం ఉత్కంఠభరితంగా ఉన్న ‘మహా’ రాజకీయాలు ఆసక్తిగా కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టుకోవటంలో సీఎం ఉద్ధవ్ ఠాక్రే కమంటే శివ‌సేన తిరుగుబాటు నేత ఏక్ నాథ్ షిండే ముందు వరుసలో ఉన్నరారు. గౌహ‌తిలో త‌న వెంట న‌డిచిన ఎమ్మెల్యేల‌ను మీడియాకు చూపించారు.

Maharashtra Politics : తన వద్ద ఉన్న 42మంది ఎమ్మెల్యేలను మీడియాకు చూపించి..బలప్రదర్శనకు రె‘ఢీ’ అంటున్న ఏక్ నాథ్ షిండే..

Maharashtra Politics : మ‌హారాష్ట్రలో రాజకీయ సంక్షోభం తీవ్రస్థాయికి చేరుకుంది. అనుక్షణం ఉత్కంఠభరితంగా ఉన్న ‘మహా’ రాజకీయాలు ఆసక్తిగా కొనసాగుతున్నాయి. కర్ణాటకను మించిన రాజకీయాలతో మహారాష్ట్ర రాజకీయాలు పోటీ పడుతున్నాయా? అన్నట్లుగా ఉంది పరిస్థితి. ఎమ్మెల్యేలను కాపాడుకోవటంలో ఇటు సీఎం ఉద్ధవ్..అలు రెబల్ నేత ఏక్ నాథ్ షిండేలు జాగ్రత్త వహిస్తున్నారు. కానీ ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టుకోవటంలో ఉద్దవ్ కంటే షిండేనే ముందు వరుసలో ఉన్నారు.  మహారాష్ట్రలో ఈ రాజకీయ సంక్షోభానికి కారణమైన శివ‌సేన తిరుగుబాటు నేత ఏక్ నాథ్ షిండే ప్ర‌స్తుతం గౌహ‌తిలో త‌న వెంట న‌డిచిన ఎమ్మెల్యేల‌ను మీడియాకు చూపించారు.

షిండే ప‌క్షాన నిలిచిన ఎమ్మెల్యేల సంఖ్య అంత‌కంత‌కూ పెరుగుతోంది. ప్ర‌స్తుతం షిండే శిబిరంలో మొత్తం 42 మంది ఎమ్మెల్యేలున్నారు. అలాగే ఉద్దవ్ ఠాక్రే తరపున 13మంది మాత్రమే ఉన్నరు. షిండే తరపున ఉన్న ఎమ్మెల్యేలలో 35 మంది శివ‌సేన‌కు చెందిన వారు కాగా… ఏడుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు. ఈ మేర‌కు త‌న శిబిరం బ‌లాన్ని ప్ర‌ద‌ర్శించిన షిండే గురువారం (జూన్ 23,2022)మ‌ధ్యాహ్నం ఓ వీడియో విడుద‌ల చేశారు.

ఈ సంద‌ర్భంగా ఏక్‌నాథ్ షిండే కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. మూడింట రెండొంతుల కంటే అధికంగా ఎమ్మెల్యేల‌ను క‌లిగిన త‌మ శిబిర‌మే అస‌లైన శివ‌సేన అని ధీమా వ్యక్తంచేశారు. గ‌వ‌ర్న‌ర్ ముందు బ‌ల ప్ర‌ద‌ర్శ‌న‌కు కూడా తాము సిద్ధంగానే ఉన్నామ‌ని షిండే తెలిపారు. నిన్న‌టిదాకా 38 మంది ఎమ్మెల్యేలే త‌న‌ వెంట ఉన్నారు అని అన్న షిండే… గురువారం ఉద‌యం మ‌రో న‌లుగురు ఎమ్మెల్యేలు త‌న శిబిరంలో చేరిన‌ట్లు వెల్ల‌డించారు.

అందుకే మేం షిండే వెంట ఉన్నాం అంటూ సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు శివసేన రెబల్ ఎమ్మెల్యేలు లేఖ..
కాగా..షిండే వెంట ఉన్న ఎమ్మెల్యేలు ఉద్ధవ్ ఠాక్రేకు ఓ లేఖ రాశారు. ఆ లేఖలో తాము షిండే వెంట ఎందుకు ఉన్నామో వివరించారు. రాష్ట్రంలో శివసేనకు సంబంధించిన వ్యక్తే సీఎంగా ఉన్నా..వర్షా బంగ్లాకు వెళ్లి ఓ వ్యక్తే అన్ని తానై చూస్తున్నారని..సొంత పార్టీ ఎమ్మెల్యేలను ఉద్ధవ్ నిర్లక్ష్యం చేశారు అంటూ పేర్కొన్నారు. కానీ తమ బాధలు చెప్పుకోవటానికి..తమకు జరిగిన అవమానాలు గురించి వెళ్లబోసుకోవటానికి ఏక్ నాథ్ షిండే ఇంటి తలుపులు మా కోసం ఎప్పుడు తెరిచే ఉండవని లేఖలో తెలిపారు.అందుకే మేం అంతా షిండే వెంటే ఉన్నాం అని తెలిపారు.

సంక్షోభం సమయంలో కూడా మీకు మీ భావోద్వేగాలనే చెప్పారు గానీ మా ప్రశ్నలకు సమాధానం మాత్రం చెప్పలేదంటూ ఆరోపించారు. రెండున్నరేళ్లుగా శివసేన ఎమ్మెల్యేలకు సీఎం నివాసం తలుపులు మూసివేశారు అని ప్రజలు ఎన్నుకున్న తాము మీ దగ్గరకు రావటానికి ప్రజలు ఎన్నుకోనివారి చుట్టూ తిరగాల్సి వచ్చిందంటూ లేఖలో వాపోయారు. రాజ్యసభ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో శివసేన ఓడిపోవటానికి కారణం కూడా అదేనని తెలియజెప్పారు.సీఎంగా మీరు ప్రతి ఒక్కరిని ఆరవ అంతస్తులో కలుసుకుంటారు. కానీ మాకు మాత్రం అక్కడికి ప్రవేశం ఇవ్వరని వాపోయారు. నియోజకవర్గం పనుల కోసం సీఎంగా ఉన్న మిమ్మల్ని కలవాలంటే ఓ వ్యక్తి అనుమతి తీసుకోవాల్సి వస్తోందంటూ తెలిపారు. ఈ లేఖను ఏక్ నాథ్ షిండే మీడియాకు విడుదల చేశారు.

×