ఓటు వేసిన ధోని

  • Published By: venkaiahnaidu ,Published On : May 6, 2019 / 10:26 AM IST
ఓటు వేసిన ధోని

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ఓటు వేశారు.ఇవాళ(మే-6,2019)జార్ఖండ్ రాజధాని రాంచీలోని జవహర్ విద్యా మందిర్ పోలింగ్ బూత్ లో కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి ధోని తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా ధోని పిలుపునిచ్చారు. లోక్ సభ ఎన్నికల ఐదో దశలో భాగంగా ఇవాళ ఏడు రాష్ట్రాల్లోని 51 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది.యూపీలోని 14,జార్ఖండ్ లోని 4,బీహార్ లోని 5,వెస్ట్ బెంగాల్ లోని 7,రాజస్థాన్ లోని 12,మధ్యప్రదేశ్ లోని 7,జమ్మూకశ్మీర్ లోని 2లోక్ సభ స్థానాలకు ఇవాళ పోలింగ్ జరుగుతోంది.