Bihar : మహిళతో ఎమ్మెల్యే డ్యాన్సులు..సీరియస్ అయిన సీఎం

ఆయనో అధికార పార్టీ ఎమ్మెల్యే ఒక చోట పెళ్లికి  వెళ్లారు. అక్కడ   వినోదం కోసం ఏర్పాటు  చేసిన డ్యాన్స్ ప్రోగ్రాంలో ఒక యువతితో కలిసి డ్యాన్సులు చేయటంతో సీఎం సీరియస్ అయ్యారు. ఈ ఘటన బీహార్ లో చోటు చేసుకుంది.

Bihar : మహిళతో ఎమ్మెల్యే డ్యాన్సులు..సీరియస్ అయిన సీఎం

Bihar Dancing Mla

Bihar :  ఆయనో అధికార పార్టీ ఎమ్మెల్యే ఒక చోట పెళ్లికి  వెళ్లారు. అక్కడ   వినోదం కోసం ఏర్పాటు  చేసిన డ్యాన్స్ ప్రోగ్రాంలో ఒక యువతితో కలిసి డ్యాన్సులు చేయటంతో సీఎం సీరియస్ అయ్యారు. ఈ ఘటన బీహార్ లో చోటు చేసుకుంది.

బీహార్ లోని  భాగల్ పూర్ నియోజకవర్గం నంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న  గోపాల్ మండల్  ఇటీవల తన నియోజకవర్గంలో జరిగిన వివాహ వేడుకకు హాజరయ్యారు. అందులో  భాగంగా అక్కడ రికార్డింగ్ డ్యాన్స్ లు  ఏర్పాటు  చేశారు. స్టేజీ మీద అందరూ కూర్చోని ఉన్నారు.  ఒక అమ్మాయి వచ్చి పాటలకు డ్యాన్స్ చేస్తోంది. ఇంతలో ఎమ్మెల్యే గోపాల్ మండల్ లో ఉత్సాహం వచ్చింది.  ఆ డ్యాన్సర్ కు ఫ్లయింగ్ కిస్ లు ఇచ్చారు.  డబ్బులు తీసి డ్యాన్సర్ పై వెదజల్లుతూ  ఆమెతో పాటు కలిసి నృత్యం చేశారు.

కాసేపటికి ఎమ్మెల్యే పక్కన కూర్చున్న పెద్దమనుషులు కూడా లేచి డ్యాన్స్ చేయటంప్రారంభించారు. ఇదంతా పెళ్లికి వచ్చిన వాళ్లు వీడియో  తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు.  ఈవీడియో  తెగ  వైరల్ అయ్యి చివరకు  జేడీయూ అధిష్టానం దృష్టికి , సీఎం కూడా చూసే స్ధాయికి వెళ్లింది.  దీంతో పార్టీ హై కమాండ్ సీరియస్ అయ్యింది.

సీఎం నితీష్ కుమార్ ఎమ్మెల్యేను పిలిచి చివాట్లు పెట్టారు. అంత బహిరంగంగా ఆ డ్యాన్సులేమిటి…. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నప్పుడు హుందాగా ఉండాలని మందలించారు.  దానికి ఆ  ఎమ్మెల్యే …. సార్  నేను పాటలు వినగానే కంట్రోల్ చేసుకోలేక పోయానని  వివరణ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు పేర్కోన్నాయి.

Also Read : Gyanvapi: జ్ఞానవాపి మసీదులో శివలింగం.. సీజ్ చేయాలన్న కోర్టు